స్టూడెంట్ డైరక్షన్ లో చైతన్య

రెండు సినిమాలు సమాంతరంగా కిందా మీదా పడి అయినా ఫినిష్ చేసేసాడు హీరో నాగ్ చైతన్య. రెండు సినిమాలు ఒకేసారి ఒప్పుకోవడం, సవ్యసాచి బాగా లేట్ కావడంతో ప్లానింగ్ బాగా బెడిసి కొట్టింది. అందుకే…

రెండు సినిమాలు సమాంతరంగా కిందా మీదా పడి అయినా ఫినిష్ చేసేసాడు హీరో నాగ్ చైతన్య. రెండు సినిమాలు ఒకేసారి ఒప్పుకోవడం, సవ్యసాచి బాగా లేట్ కావడంతో ప్లానింగ్ బాగా బెడిసి కొట్టింది. అందుకే ఈసారి సినిమా తరువాత సినిమానే అని డిసైడ్ అయ్యాడని వినికిడి. అయితే ఈ రెండు సినిమాల  తరువాత ఏంటీ? అన్నది క్వశ్చను. దీనికి సమాధానం రెడీగా వుందని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియో ఫిల్మ్ ఇన్స్ టిట్యూట్ లో తర్ఫీదు పొందిన ఓ కొత్త యంగ్ స్టూడెంట్ డైరక్షన్ లో చైతన్య సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

స్టూడెంట్ చెప్పిన పాయింట్ ను నాగ్, చైతన్య ఇద్దరూ ఒకె చేసినట్లు వినిపిస్తోంది. అక్టోబర్ లో ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. అప్పటికి శైలజరెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాల విడుదల పూర్తయిపోతుంది.

అయితే ఈసారి చైతన్య ఏ జోనర్ స్టోరీఓకె చేసాడో ఇంకా తెలియలేదు. యంగ్ బ్యాచ్ డైరక్టర్ కాబట్టి కచ్చితంగా వైవిధ్యమైన సబ్జెక్ఠ్ అయి వుంటుంది. పైగా కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు నాగ్, చైతూ అంటే ఏదో సమ్ థింగ్..సమ్ థింగ్ వుండనే వుండాలి. మరి కొన్ని రోజులు ఆగితే మరిన్ని అప్ డేట్స్ బయటకు వస్తాయి.