శాండ్ విచ్ బ్రాండ్ బాబు

పాపం, ఎంచి ఎంచి డేట్ సెట్ చేసుకున్నారు దర్శకుడు మారుతి తను కథ, మాటలు అందించి, నిర్మించిన బ్రాండ్ బాబు సినిమాకు. ఈటీవీ ప్రభాకర్ గా పేరుపడిన సీరియళ్ల డైరక్టర్ మలి ప్రయత్నం ఇది.…

పాపం, ఎంచి ఎంచి డేట్ సెట్ చేసుకున్నారు దర్శకుడు మారుతి తను కథ, మాటలు అందించి, నిర్మించిన బ్రాండ్ బాబు సినిమాకు. ఈటీవీ ప్రభాకర్ గా పేరుపడిన సీరియళ్ల డైరక్టర్ మలి ప్రయత్నం ఇది. తొలి ప్రయత్నం గీతాలో చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే మారుతి మంచి కాన్సెప్ట్, మంచి స్క్రిప్ట్ అందించడంతో, ఈసారి విజయం సాధిస్తాడేమో అన్న చిన్న నమ్మకం కలిగింది.

కానీ తీరాచూస్తే, బ్రాండ్ బాబు అనేక సినిమాల మధ్య శాండ్ విచ్ అయిపోయేలా కనిపిస్తోంది పరిస్థితి. సాక్ష్యంతో పాటు విడుదలవుతుంది అనుకున్న సుశాంత్  చి.ల.సౌ సినిమా వెనక్కు వచ్చి ఈ ‘బాబు’ మీద పడింది. దాంతో పాటు అడవి శేష్’ గూఢచారి’ సినిమా కూడా మూడో తేదీనే విడుదల. ఈ రెండు సినిమాలకు ఇప్పటికే మాంచి బజ్ వచ్చింది. బ్రాండ్ బాబు పబ్లిసిటీ ఇంకా అదుకోవాల్సి వుంది.

వాస్తవానికి బ్రాండ్ బాబుకు కొన్ని పాజిటివ్ పాయింట్లు వున్నాయి. బిసి సెంటర్ల సినిమా కావడం, మారుతి బ్రాండ్ నేమ్, మంచి బయ్యర్ల చేతిలో పడడం వంటివి పాజిటివ్ సైన్ అనుకోవాలి. కానీ జనాలు డిఫరెంట్ మూవీస్ నే ఆదరిస్తున్నారు. చి.ల.సౌ, గూఢచారి ఆ జోనర్ కు చెందినవి. మరోపక్క 9న శ్రీనివాస కళ్యాణం వస్తోంది. దానికి సూపర్ బజ్ వుంది.

ఇలా ఇన్నింటి మధ్య ఇరుక్కున్న బ్రాండ్ బాబు ఎలా బయటపడి నెగ్గుకు వస్తాడో చూడాలి. కన్నడ నిర్మాత శైలేంద్ర బాబు తన కొడుకును హీరో చేసే తొలి ప్రయత్నం ఇది.