వామ్మో.. వెంకీ, చైతూ జాయింట్ కామెడీ!

కామెడీ విషయంలో వెంకటేష్ సంగతి తెలిసిందే. తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ తో అదిరిపోయే రేంజ్ లో కామెడీ పండించగలడు ఈ హీరో. అతడి సీనియారిటీ మొత్తం అలాంటి కామెడీ సీన్లలో కనిపిస్తుంది. సో..…

కామెడీ విషయంలో వెంకటేష్ సంగతి తెలిసిందే. తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ తో అదిరిపోయే రేంజ్ లో కామెడీ పండించగలడు ఈ హీరో. అతడి సీనియారిటీ మొత్తం అలాంటి కామెడీ సీన్లలో కనిపిస్తుంది. సో.. వెంకీ కామెడీ మనకు కొత్త కాదు. ఎటొచ్చి నాగచైతన్య కామెడీ అంటేనే కాస్త డౌట్ కొడుతోంది. 

అవును.. వీళ్లిద్దరూ కలిసి చేయబోయే ఓ మల్టీస్టారర్ మూవీలో యాక్షన్ తక్కువ, కామెడీ ఎక్కువగా ఉంటుందట. ఈ మేరకు పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడట దర్శకుడు బాబి. అతడికి కోన వెంకట్ నుంచి పూర్తి సహకారం లభించింది. స్క్రిప్ట్ బాగా వచ్చిందని గట్టిగా చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, ఆ కామెడీ స్క్రీన్ ప్లేలో చైతూ ఎంతమేరకు ఫిట్ అవుతాడనేది ఇప్పుడు పెద్ద సందేహం.

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాగచైతన్య కామెడీ చేసిన దాఖలాల్లేవు. అతడి సినిమాల్లో కామెడీ చేస్తే కమెడియన్లు చేయాలి, లేదంటే సిచ్యువేషనల్ కామెడీ పండాలి. అంతేతప్ప, తన డైలాగ్ డెలివరీతో చైతూ కామెడీ పండించింది లేదు. అలాంటి హీరో ఇప్పుడు వెంకీ లాంటి సీనియర్ హీరోతో ఎలా కామెడీ పండిస్తాడో చూడాలి. 

ఆగస్ట్ 8 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. సినిమాలో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. వెంకీ సరసన హీరోయిన్ ను ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.