సాహో థర్టీ పర్సంట్ @120 కోట్లు

బాహుబలి ప్రభాస్ తో యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న భారీ సినిమా సాహో. ఈ సినిమా ఇప్పటికి ముఫైశాతం పూర్తయింది. దానికే 120కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి సినిమా బడ్జెట్ ఏ లెవెల్…

బాహుబలి ప్రభాస్ తో యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న భారీ సినిమా సాహో. ఈ సినిమా ఇప్పటికి ముఫైశాతం పూర్తయింది. దానికే 120కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి సినిమా బడ్జెట్ ఏ లెవెల్ లో వుంటుందో ఊహించుకోవచ్చు. మూడువందల కోట్లతో సినిమా ఫస్ట్ కాపీ వస్తే హ్యాపీయే అన్న ఆలోచనలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వున్నట్లు తెలుస్తోంది. ఒక్క దుబాయ్ ఎపిసోడ్ కే వందకోట్లు హాం.. ఫట్ అయిపోయాయట.

సినిమా టోటల్ గా మూడువందల కోట్ల బడ్జెట్ కాబట్టే అమ్మకాలు కూడా ఆ రేంజ్ లోనే వుంటాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి బాహుబలి రెండు భాగాలకు కలిపి కూడా మూడువందల కోట్లు ఖర్చు అయివుండదు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న సాహో 2019 సమ్మర్ తరువాత థియేటర్లలోకి వచ్చే అవకాశం వుంది. 

ఇప్పటికే బాలీవుడ్ లో టీ సీరిస్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నాన్ యూఎస్ ఓవర్ సీస్ మార్కెటింగ్ మీద డిస్కషన్లు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. రేటు ఫిక్స్ చేసుకుంటే అడ్వాన్స్ లు వస్తే కాస్త పని సులువు అవుతుంది. ఎలాలేదన్నా మూడువందల కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు కదా?

పైగా అదే టైమ్ లో వేరే సినిమాల ప్లాన్ లు, డిస్ట్రిబ్యూషన్, థియేటర్లు అంటే చిన్న విషయం కాదు. మొత్తంమీద యూవీ క్రియేషన్స్ టర్నోవర్ భయంకరంగా పెరిగేలాగే కనిపిస్తోంది.