ఇంకా లేట్ అవుతుందని పరోక్షంగా చెప్పాడు

నా పేరు సూర్య సినిమా థియేటర్లలోకి వచ్చి 2 నెలలు దాటింది. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో విడుదలైన 2 వారాలకే దుకాణం సర్దేశారు. అయితే ఆ సినిమా వచ్చిపోయి దాదాపు 80 రోజులవుతున్నా..…

నా పేరు సూర్య సినిమా థియేటర్లలోకి వచ్చి 2 నెలలు దాటింది. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో విడుదలైన 2 వారాలకే దుకాణం సర్దేశారు. అయితే ఆ సినిమా వచ్చిపోయి దాదాపు 80 రోజులవుతున్నా.. ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ చేయలేదు బన్నీ. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ స్టార్ట్ అయింది. 

ఒక్క సినిమా ఫ్లాప్ కే బన్నీ గ్యాప్ తీసుకున్నాడంటూ ఓ సెక్షన్ ట్రోలింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు బన్నీ. పైగా తన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వాలనుకున్నాడు. అందుకే ట్వీట్ చేశాడు. 

“మై డియర్ ఫ్యాన్స్.. మీ అందరి అభిమానానికి థ్యాంక్స్. నా నెక్ట్స్ సినిమా ప్రకటనపై అందరూ కాస్త ఓపికతో వ్యవహరించాలని కోరుతున్నాను. ఎందుకంటే దీనికి ఇంకాస్త టైమ్ పడుతుంది. జెన్యూన్ గా ఓ మంచి సినిమా అందించాలని ఉంది. కాబట్టి టైం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్.”

ఇలా అందరికీ తన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు అల్లుఅర్జున్. ఇప్పట్లో బన్నీ తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడనే విషయం మాత్రం తాజా ట్వీట్ తో స్పష్టమైంది. దగ్గర్లో ప్రకటించే స్కోప్ ఉంటే అసలు ఈ ట్వీట్ పెట్టడు కదా. ఓపిగ్గా ఉండాలని చెప్పిన బన్నీ, ఎన్నిరోజుల్లో తన సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందనే విషయాన్ని చూచాయగా చెప్పినా బాగుండేది. కానీ ఆ పని చేయలేదు

ఈ గ్యాప్ లో తన కాంపౌండ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు బన్నీ. మొన్నటికి మొన్న విజేత సినిమా సక్సెస్ మీట్ కు వెళ్లాడు. ఎల్లుండి గీతగోవిందం ఆడియో ఫంక్షన్ కు ఎటెండ్ కాబోతున్నాడు. పనిలోపనిగా మరోసారి ఫారిన్ ట్రిప్ కూడా ప్లాన్ చేశాడు.