దర్శకులకు రాను రాను లాస్ట్ మినిట్ చెక్కుళ్లు ఎక్కువయిపోయాయి. జూలై 27 డేట్ ఎప్పడో అనౌన్స్ చేసినా 26 రాత్రి 9 గంటల వరకు సౌండ్ క్వాలిటీ, కరెక్షన్లు చేస్తూనే వున్నారట సాక్ష్యం సినిమాకు. వారం రోజులుగా చెన్నయ్ లో కూర్చున్న దర్శకుడు శ్రీవాస్ ఇంకా.. మరికాస్త.. ఇంకొంచెం అంటూ ఆఖరికి 26 రాత్రి 9 గంటలకు కంటెంట్ ఫైనల్ చేయగలిగాలరని వినికిడి.
దాంతో యూనిట్ లో ప్రతిఒక్కరూ తలోచోట కూర్చుని కిందామీదా పడిపోయారు. ఆఖరికి శుక్రవారం ఉదయాన్నే, విశాఖ, తిరుపతి, అమెరికా తదితర ప్రాంతాలకు హార్డ్ డిస్క్ ల పంపించగలిగారు. విజయవాడకు, మరికొన్ని ప్రాంతాలకు కార్లలో పంపించారు. అలాగే విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతిల్లో భారీగా కార్లు సిద్దంచేసి రూరల్ ఏరియాలకు పంపించే ఏర్పాట్లు చేసారు.
దీనివల్ల కొన్నిచోట్ల వేద్దామనుకున్న ఎర్లీ హవర్స్ షో లు క్యాన్సిల్ అయ్యాయి. అమెరికాలో విడుదల కాస్త గట్టిగానే ఆల్యసం అయ్యేలా వుంది. మొత్తంమీద ప్లానింగ్ ఎంత చేసుకున్నా సాక్ష్యం సినిమాకు లాస్ట్ మినిట్ ఇబ్బందులు తప్పలేదు.