యూవీ చేతికి శైలజారెడ్డి అల్లుడు

శైలజారెడ్డి అల్లుడు సినిమా టీజర్ రావడానికి ఇంకా రెండురోజలు టైమ్ వుంది. ఇప్పటికే సినిమా బిజినెస్ ఒక్కో ఏరియా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. లేటెస్ట్ గా శైలజారెడ్డి అల్లుడు కృష్ణ, గుంటూరు హక్కులు యూవీ…

శైలజారెడ్డి అల్లుడు సినిమా టీజర్ రావడానికి ఇంకా రెండురోజలు టైమ్ వుంది. ఇప్పటికే సినిమా బిజినెస్ ఒక్కో ఏరియా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. లేటెస్ట్ గా శైలజారెడ్డి అల్లుడు కృష్ణ, గుంటూరు హక్కులు యూవీ క్రియేషన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

యూవీ క్రియేషన్స్ కు దర్శకుడు మారుతికి మంచి సంబంధాలు వున్నాయి. పైగా ప్రాజెక్టు ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. అందుకే ఈ సినిమా హక్కులను యూవీ తీసుకున్నట్లు కనిపిస్తోంది.శైలజారెడ్డి అల్లుడు సినిమాను ఆంధ్ర ఏరియాకు తొమ్మిది నుంచి పదికోట్ల రేషియోలో విక్రయించారు. ఇప్పుడు ఆ రేషియోలోనే కృష్ణ, గుంటూరు హక్కులు యూవీకి ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాధారణంగా యూవీ క్రియేషన్స్ ఎక్కువగా గుంటూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అలాగే సీడెడ్ లోనూ. మెల్లగా మిగిలిన ఏరియాలకు కూడా విస్తరిస్తున్నారు. ఆ మధ్య నైజాం ఏరియాలో రంగస్థలం సినిమాతో ఎంటర్ అయ్యారు. అలాగే రామ్ చరణ్-బోయపాటి సినిమా టోటల్ తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ కొనేసారు. 

శైలజారెడ్డి ఆగస్టు 31 విడుదల లక్ష్యంగా రెడీ అవుతోంది.