కారు కొనిచ్చినా… నో యూజ్..?

బిజినెస్ అన్నాక సవాలక్ష వుంటాయి. ఇవ్వడాలు.. పుచ్చుకోవడాలు కామన్. అయితే ఎప్పటి వ్యవహారం అప్పటిదే. ఏ పూట టిఫిన్ ఆ పూటదే. మర్నాటి వ్యవహారం వేరే. ఓ ఓవర్ సీస్ బయ్యర్ ఇప్పుడు ఇలాగే…

బిజినెస్ అన్నాక సవాలక్ష వుంటాయి. ఇవ్వడాలు.. పుచ్చుకోవడాలు కామన్. అయితే ఎప్పటి వ్యవహారం అప్పటిదే. ఏ పూట టిఫిన్ ఆ పూటదే. మర్నాటి వ్యవహారం వేరే. ఓ ఓవర్ సీస్ బయ్యర్ ఇప్పుడు ఇలాగే అనుకుని పాపం, సమాధాన పడుతున్నారట. విషయం ఏమిటంటే, యూఎస్ లో సీనియర్ బయ్యర్ అయిన ఓ వ్యక్తి గతంలో చాలా సినిమాలు చేసారు. ఈ మధ్య కాస్త వెనక్కు తగ్గారు. టాలీవుడ్ లోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఆయనకు మాంచి సంబంధాలే వుండేవి. 

ఆ సంస్థ సినిమాలు ఎక్కువగా ఆయన కొంటూ వుండేవారు. అలాంటి టైమ్ లో ఓ మాంచి క్లాస్ మూవీ ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసారు. ఆ సందర్భంగా మంచి లాభాలు కూడా కళ్ల చూసారు. ఆ టైమ్ లో ఓ ఖరీదైన కారు కూడా ఆ నిర్మాణ సంస్థకు చెందిన కీలక వ్యక్తికి బహుమతిగా ఇచ్చారట. కానీ తరువాత ఏమయిందో, ఆ సంస్థ తన తరువాత భారీ సినిమాను వేరే కొత్త బయ్యర్ కు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా రాబోయే మరో మూడు సినిమాల హక్కులను కూడా ఆ బయ్యర్ కే ఇచ్చారట.

దీంతో తాను అంత సన్నిహితంగా వుండి, నమ్మకంగా డిస్ట్రిబ్యూట్ చేసి, కారు గిఫ్ట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని ఫీలవుతున్నారట సదరు డిస్ట్రిబ్యూటర్.