బిగ్ బాస్ చుట్టూ మరో నెగెటివ్ సెంటిమెంట్

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్-1 సూపర్ హిట్ అవ్వడమే కాదు, దానికో పాజిటివ్ సెంటిమెంట్ కూడా క్రియేట్ అయింది. అదేంటంటే.. ఆ సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో…

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్-1 సూపర్ హిట్ అవ్వడమే కాదు, దానికో పాజిటివ్ సెంటిమెంట్ కూడా క్రియేట్ అయింది. అదేంటంటే.. ఆ సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో ప్రమోట్ చేసిన సినిమాలు 90శాతం హిట్ అయ్యాయి. కానీ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్-2 మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.

బిగ్ బాస్ సీజన్-2 చప్పగా ఉందనే విమర్శల్ని పక్కనపెడితే, ఈసారి ప్రమోట్ చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అవ్వడం ఈ షోపై నెగెటివ్ సెంటిమెంట్ పడేలా చేశాయి. ఇప్పటివరకు సీజన్-2లో మూడు సినిమాలు ప్రమోట్ చేస్తే, మూడూ ఫ్లాపులయ్యాయి.

వైఫ్ ఆఫ్ రామ్ ప్రచారం కోసం మంచులక్ష్మి, తేజ్ ఐలవ్ యు ప్రమోషన్ కోసం సాయిధరమ్ తేజ్-అనుపమ, జంబలకిడిపంబ సినిమాకు మైలేజీ కోసం మరికొంతమంది కమెడియన్లు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లారు. కానీ ఈ మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో రాబోయే సినిమాలకు సంబంధించి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు మేకర్స్.

ఈ విషయంలో సీజన్-1 మాత్రం సూపర్ హిట్ అయింది. నేనేరాజు నేనేమంత్రి సినిమా ప్రచారం కోసం రానా, ఆనందో బ్రహ్మ కోసం తాప్సి, అర్జున్ రెడ్డి కోసం విజయ్ దేవరకొండ, జైలవకుశ కోసం కల్యాణ్ రామ్-రాశిఖన్నా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలా ప్రమోట్ చేసిన మేడమీద అబ్బాయి, ఉంగరాల రాంబాబు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

కానీ బిగ్ బాస్ సీజన్-2లో ఇలా ప్రమోట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. చెప్పుకోవడానికి ఒక్క హిట్ లేదు. సీజన్-2 స్టార్ట్ అయి దాదాపు 44 రోజులవుతోంది. ఈ 6వారాల్లో ఒక్క సినిమా కూడా బిగ్ బాస్ చలవతో సక్సెస్ అయిన దాఖలాల్లేవు. అలా నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్-2 ఈ యాంగిల్ లో కూడా ఫ్లాప్ అయింది.