చంద్రబాబుతో విభేదాలు నిజమేనట ?

చంద్రబాబునాయుడు టీడీపీ అధినేత. ఆయన బీ ఫారం ఇస్తే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు గంటా శ్రీనివాసరావు. అంతే కాదు చంద్రబాబు డిస్కవరీ గంటా అని చెబుతారు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా తొలిసారి…

చంద్రబాబునాయుడు టీడీపీ అధినేత. ఆయన బీ ఫారం ఇస్తే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు గంటా శ్రీనివాసరావు. అంతే కాదు చంద్రబాబు డిస్కవరీ గంటా అని చెబుతారు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా తొలిసారి రాజకీయాల్లో చాన్స్ అలా గంటాకు బాబు కల్పించారు.

ఆ తరువాత ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల తరువాత గంటా చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. పైగా ఆయన అసెంబ్లీ సమావేశాలల్లో కూడా పెద్దగా కనిపించడంలేదు. 

అటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన హాజరు లేకుండా పోతోందన్న మాట ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుతో తనకు కొంత ఎడం ఉన్న మాట నిజమేనని గంటా చెప్పడం విశేషం. 

2019 ఎన్నికల వేళ తనను విశాఖ ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు కోరారని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని, అది కమ్యూనికేషన్ గ్యాప్ అయినా కూడా ఆ  తరువాత చంద్రబాబును పెద్దగా కలవలేదని గంటా చెప్పుకొచ్చారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్ళకు దగ్గరపడుతున్నా కూడా బాబు గంటాల మధ్యన గ్యాప్ అలాగే ఉంది అంటున్నారు.

దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి

లోకేష్ పార్టీని నడపగలుగుతారా?