ఆహా లోకి రానా

హీరో రానా టాక్ షో జనాలకు ఇంకా గుర్తుంది. చాలా మంది సెలబ్రిటీలతో మూడు సీజన్లు విజయవంతంగా సాగిన ఈ టాక్ షో ఇఫ్పుడు రూటు మార్చింది.  Advertisement ఎంటర్ టైన్ మెంట్ చానెల్…

హీరో రానా టాక్ షో జనాలకు ఇంకా గుర్తుంది. చాలా మంది సెలబ్రిటీలతో మూడు సీజన్లు విజయవంతంగా సాగిన ఈ టాక్ షో ఇఫ్పుడు రూటు మార్చింది. 

ఎంటర్ టైన్ మెంట్ చానెల్ నుంచి యాప్ లోకి వచ్చింది. ఆహా ఒటిటిలో రానా టాక్ షో ప్రారంభం కాబోతోంది. ఆ మధ్య సమంతతో ఓ సీజన్ టాక్ షో ఫినిష్ చేసిన ఆహా ఇప్పుడు రానా టాక్ షోను ఈ నెల 14 నుంచి ప్రారంభించబోతోంది. 

జెమినీ టీవీలో ఇప్ప‌టి వ‌ర‌కు నెం.1 యారీ షోస్ మూడు సీజ‌న్స్ ప్ర‌సార‌మ‌య్యాయి. ఈ మూడు సీజ‌న్స్‌కు రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 

ఇప్పుడు జెమినీ టీవీ నుంచి స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా తీసుకుంది. అయితే ఇప్పటికే చాలా టాక్ షోలు వచ్చేసాయి. రానానే దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరినీ ఓ రౌండ్ వేసేసారు.. మరి కొత్తగా ఎవరు వస్తారో?  రానా కొత్తగా ఏం చేయబోతున్నారో చూడాలి. 

దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి

లోకేష్ పార్టీని నడపగలుగుతారా?