రాజ్ తరుణ్ పరువు తీసిన దిల్ రాజు

హీరోకు ఎన్ని ఫ్లాపులైనా ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో అతడికొక గౌరవం ఉంటుంది. 'ఆ హీరో వేస్ట్ ఫెలో' అని ఎవరూ అనరు. మరీ ముఖ్యంగా పత్రికా ముఖంగా అలాంటి ప్రకటనలు అస్సలు చేయరు. చులకన…

హీరోకు ఎన్ని ఫ్లాపులైనా ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో అతడికొక గౌరవం ఉంటుంది. 'ఆ హీరో వేస్ట్ ఫెలో' అని ఎవరూ అనరు. మరీ ముఖ్యంగా పత్రికా ముఖంగా అలాంటి ప్రకటనలు అస్సలు చేయరు. చులకన భావం లేదా కోపం ఉంటే ఆఫ్ ది రికార్డు తిట్టుకోవచ్చు కానీ మీడియా ముందు హీరోను చులకన చేసి మాట్లాడ్డం చాలాఅరుదు. అందునా నిర్మాతలు హీరోల్ని తక్కువచేసి మాట్లాడ్డం టాలీవుడ్ లో చాలా అరుదు. 

దిల్ రాజు మాత్రం రాజ్ తరుణ్ ను చాలా తక్కువచేసి మాట్లాడాడు. లవర్ ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దిల్ రాజు.. తనకు తెలియకుండానే రాజ్ తరుణ్ పై చాలా కామెంట్స్ చేశాడు. రాజ్ తరుణ్ కు వరుసగా ఫ్లాపులు ఉన్నమాట వాస్తవమే. కానీ అతడికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదు దిల్ రాజు. 

ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ పై దిల్ రాజు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..

“నిజం మాట్లాడుకుంటే.. రాజ్ తరుణ్ మార్కెట్ గురించి మనందరికీ తెలిసిందే. అతడో అప్ కమింగ్ హీరో. గడిచిన 2-3 సినిమాలు అస్సలు వర్కవుట్ కాలేదు. అలాంటి హీరోపై 8 కోట్లు పెట్టాను.”

“హీరోను కాదు, మా బ్యానర్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా తీశాం. ఆ హీరోకు 4-5 కోట్లు పెట్టడం చాలా ఎక్కువ. అలాంటిది ఆల్ మోస్ట్ మేం డబుల్ బడ్జెట్ కు వెళ్లాం. రాజ్ తరుణ్ తో 8కోట్ల బడ్జెట్ తో వెళ్లడం అంత హెల్తీకాదు.”

“రాజ్ తరుణ్ హీరో అనగానే ఎలాంటి అమ్మాయిని పెట్టాలనేది సమస్య. రాజ్ తరుణ్ అంటే ఇలాంటి కష్టాలన్నీ తప్పవు. పెద్ద హీరోయిన్లను వచ్చి చేయమంటే రాజ్ తరుణ్ పక్కన ఎవరూ చేయరు. ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలు.” 

“మా బ్యానర్ లో సినిమా చేస్తానని రాజ్ తరుణ్ చాన్నాళ్లుగా అడుగుతున్నాడు. సరే.. చూద్దాం అన్నాను. లవర్ కథ అతడికి కరెక్ట్ అనిపించింది. మా బ్యానర్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో సినిమా చేయలేదు. రాజ్ తరుణ్ మార్కెట్ కు ఇది చాలా ఎక్కువ.”

“హర్షిత్ (ఈ సినిమా నిర్మాత) నా దగ్గరకొచ్చి పాటకో సంగీత దర్శకుడ్ని పెడతానన్నాడు. రాజ్ తరుణ్ సినిమాకు అవసరమా అని అడిగాను.” 

ఇలా తనకు తెలియకుండానే రాజ్ తరుణ్ ను తక్కువచేసి మాట్లాడాడు దిల్ రాజు. సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ గురించి ఒక్కముక్క కూడా మాట్లాడని దిల్ రాజు.. 8కోట్లు పెట్టితీసిన లవర్ పై చాలా టెన్షన్ గా ఉన్నానని అంటున్నాడు. ఈమధ్య కాలంలో ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదని, లవర్ రిజల్ట్ పై మాత్రం ఆందోళనగా ఉందంటున్నాడు.