సాయిధరమ్ తేజ్ కు ఇష్టమైన ఖర్చు

మనిషి అన్నవాడు ఎవరికైనా ఏదో హాబీ, సరదా వుంటుంది. అలాంటివాటిపై ఎంత ఖర్చుచేసినా కష్టం అనిపించదు. ఇష్టంగానే వుంటుంది. హీరోలు, హీరోయిన్లకు ఇలాంటి సరదాలు చాలా వుంటాయి. చెప్పుల మీద, బ్యాగుల మీద, డ్రెస్…

మనిషి అన్నవాడు ఎవరికైనా ఏదో హాబీ, సరదా వుంటుంది. అలాంటివాటిపై ఎంత ఖర్చుచేసినా కష్టం అనిపించదు. ఇష్టంగానే వుంటుంది. హీరోలు, హీరోయిన్లకు ఇలాంటి సరదాలు చాలా వుంటాయి. చెప్పుల మీద, బ్యాగుల మీద, డ్రెస్ ల మీద విపరీతంగా ఖర్చు చేసేవాళ్లు చాలామందే వున్నారు.

అయితే యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ది చిత్రమైన హాబీ. మనవాడికి బొమ్మలంటే చాలాఇష్టం అంట. బొమ్మలు అంటే వంద, వెయ్యితో పోతుంది అనుకుంటే సరికాదు, బొమ్మల్లోనూ కాస్ట్లీ బొమ్మలు వున్నాయి. ఖరీదైన రిమోట్ కార్లు, వైర్ లెస్ టాయ్స్, ఇంకా అనేకరకాలు.

అందువల్ల విదేశాలకు వెళ్లినపుడు, ఇండియాలో కూడా సాయిధరమ్ టాయ్స్ అంటే తెగ ముచ్చటపడతాడని వినికిడి. మినియేచర్లు, మోడళ్లు, ఫ్యాన్సీ చిన్నచిన్న పిల్లోలు ఇలా ఏది కనిపిస్తే అది కొంటాడట. ఇంకా గమ్మత్తు ఏమిటంటే, యంగ్ ఏజ్ లో వరుణ్ తేజ్, నీహారికలతో కలిసి సాయిదరమ్ కాఫీడే లాంటి వాటిల్లో సండేలు వర్క్ చేసి, ఆ డబ్బులతో బొమ్మలు కొనేవారట.

వాటిని కొన్నాళ్ల తరువాత స్ట్రీట్ చిల్డ్రన్ లాంటి వాళ్లకు ఇచ్చేసేవాడట. ఇప్పటికీ అలా బొమ్మలుకొనే అలవాటు పోలేదు. ఇంట్లోనూ, కారులోనూ కూడా ఈ బొమ్మలు కనిపిస్తుంటాయట.