Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కాఫీతోటల్లో టాప్ హీరో పెట్టుబడులు

కాఫీతోటల్లో టాప్ హీరో పెట్టుబడులు

మెగాస్టార్. నాగ్, వెంకీ దగ్గర నుంచి హీరోల పద్దతులు మారాయి. ఆ మాటకు వస్తే ఎఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ లు కూడా వచ్చిన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. వారి ముందుతరం నుంచి వారు నేర్చుకున్న పాఠాలు, తీసుకున్న జాగ్రత్తలు అవి. అక్కడి నుంచి ఆ తరువాత తరానికి, ఆ తరువాతి తరానికి అవే జాగ్రత్తలు వస్తున్నాయి. ఎవ్వరో ఒకరో ఇద్దరో తప్పిస్తే మిగిలిన హీరోలంతా వస్తున్న ఆదాయాన్ని, దానికి తగినట్లు ఎక్కడో ఒక దగ్గర పెట్టుబడులు పెడుతున్నవారే.

మెగాస్టార్ చెన్నయ్ లో రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టారని చెప్పుకుంటారు. మాటీవీలో ఆయన పెట్టుబడి బంగారు బాతుగుడ్డే అయింది. ఇక రామ్ చరణ్ చాలా విధాలుగా పెట్టుబడులు పెడుతున్నారు. రకరకాలుగా పెట్టుబడులు పెట్టడంలో హీరో నాగార్జున తరువాతే ఎవరైనా? అలాగే బన్నీ కూడా వేరే వేరు వ్యాపారాల మీద పెడుతున్నారు. మహేష్ బాబు రియల్ ఎస్టేట్, కమర్షియల్ కాంప్లెక్స్ లు వంటి వాటిపై మదుపు పెడతారని వినికిడి. ఇలా ఎవరి రేంజ్ లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఒక హీరో కాఫీ తోటల మీద పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

సిటీలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయన స్లీపింగ్ పార్టనర్ గా వుంటూ, కమర్షియల్ కాంప్లెక్స్ లపై ఇన్వెస్ట్ చేస్తున్నారట. అదే సమయంలో తన ఫ్యామిలీకి కాస్త కర్ణాటక కనెక్షన్స్ వుండడంతో, కాఫీ తోటలపై దృష్టి సారించి, పదుల సంఖ్యలో ఎకరాలు కొని, పెట్టుబడి పెట్టినట్లు వినికిడి. ఈ రోజుల్లో హీరోలకు రెండుకోట్ల నుంచి ఇరవైకోట్ల రేంజ్ పారితోషికాలు వున్నాయి. ఆ మధ్య వరుసగా మూడు హిట్ లు రావడంతో, చేతిలో మూడు సినిమాలు లైన్లో వుండడంతో ఆ హీరో కాస్త గట్టిగానే పెట్టుబడులు పెట్టినట్లు వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?