తెలుగు మీడియా వదిలేసిందనే?

టాలీవుడ్ సెక్స్ వ్యవహారాల సంచలనాలకు కేంద్ర బిందువు శ్రీరెడ్డి ఈ మధ్య తన ఫోకస్ ను తమిళ సినీ పరిశ్రమకేసి మళ్లించింది. మురుగదాస్ నుంచి సి సుందర్ వరకు చాలా మందినే టార్గెట్ చేసింది.…

టాలీవుడ్ సెక్స్ వ్యవహారాల సంచలనాలకు కేంద్ర బిందువు శ్రీరెడ్డి ఈ మధ్య తన ఫోకస్ ను తమిళ సినీ పరిశ్రమకేసి మళ్లించింది. మురుగదాస్ నుంచి సి సుందర్ వరకు చాలా మందినే టార్గెట్ చేసింది. దాదాపుగా తమిళ ఇండస్ట్రీ జనాలు కూడా చాలా మంది తనను వాడేసుకున్నారని ఆమెనే సోషల్ నెట్ వర్క్ లో ప్రకటించేసింది. ఇంతమందితో పక్క పంచుకుంటే జబ్బులు రావా అని ప్రశ్నించిన జనాలకు, కండోమ్ ల గురించి తెలియదా? తనకు తన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం తెలుసు అంటూ ఎదురు సమాధానం కూడా ఇచ్చేసింది.

ఆరంభంలో కేవలం తెలుగు సినిమా పరిశ్రమనే టార్గెట్ చేసి, తమిళ్ లింక్ ల గురించి కొంచెం కూడా మాట్లాడని శ్రీరెడ్డి ఇప్పుడు దృష్టి ఎందుకు మళ్లించింది? దీనికి కారణం ఒకటే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగు మీడియాను శ్రీరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఒక విధంగా చెప్పాలంటే చాన్స్ లు ఇస్తామని సినిమా జనాలు శ్రీరెడ్డిని వాడుకుంటే, టీఆర్పీల కోసం మీడియా శ్రీరెడ్డి సంచలనాన్ని వాడుకుంది. కానీ సినిమా పెద్దలు చాలా మంది ఇబ్బంది పడడంతో, అక్కడ మళ్లీ మనం మనం బరంపురం వ్యవహారం గుర్తుకు వచ్చి, ఇక చాలు అని శ్రీరెడ్డిని పక్కన పెట్టారు.

ఇప్పుడు శ్రీరెడ్డి దృష్టి అటు మళ్లింది. దాని ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. తమిళ మీడియా జనాలు నేరుగా శ్రీరెడ్డిని కాంట్రాక్టు చేయలేకపోయినా, ఫోన్ ఇన్ ఇంటర్వూలు చేస్తున్నారు. అప్పుడే యూ ట్యూబ్ ఇలాంటివి లోడ్ కావడం ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా సెలబ్రిటీలు కావడంతో అక్కడి మీడియాకు ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా యూ ట్యూబ్ చానెళ్లకు. దాంతో వాళ్లను శ్రీరెడ్డి పోస్టింగ్ లు బాగానే ఆకట్టుకుంటున్నాయి.

సో ఆ విధంగా, శ్రీరెడ్డి తను కొరుకున్న మీడియా సంచలనాన్ని సాధించగలుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ శ్రీరెడ్డి జాగ్రత్తగా వుండాలి. తమిళ లాయర్లు తక్కువ వాళ్లు కాదు. నోటీసుల మీద నోటీసులు కొడితే ప్రతిసారీ వెనక్కు తగ్గిపోవడం సాధ్యం కాకపోవచ్చు.  నాని, శేఖర్ కమ్ముల వంటి వాళ్ల విషయంలో అలాగే జరిగింది.  ఆమె ఎందుకు తగ్గిందో, వీళ్లు ఎందుకు ఊరుకున్నారో, వాళ్లకు వాళ్లకే తెలియాలి. తమిళ తంబిల వ్యవహారం మాత్రం అలా వుండకపోతే, శ్రీరెడ్డి కథ మరో టర్న్ తీసుకుంటుందేమో?