ఏదో ఫలానా నిర్మాత, ఫలానా హీరో.. ఫలానా నిర్మాత తనయుడు.. అని అంటే అదో ముచ్చటగా నిలిచింది. అక్కడకూ వాళ్లేమీ బలత్కారం చేయలేదు. లొంగిపోయింది కాబట్టి ఈమె మోసపోయింది. అప్పట్లో టీవీ చానళ్లు చేసిన అతితో.. ఆమెను జనాలు కూడా విసుగుగా ఫీలవ్వడం మొదలైంది. ఇప్పుడు టీవీ చానళ్లేమో ఆమెపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. అతి చేస్తే గతి చెడుతుంది అనేది ఇందుకే.
ఇక లోకల్ మీడియా తనను పట్టించుకోలేది అనుకుందో ఏమో కానీ.. ఇప్పుడు విడతల వారీగా కొత్త కొత్త పేర్లతో వస్తోంది వివాదాస్పద నటి. మొన్నేమో లారెన్స్, ఇప్పుడు సుందర్.సి, మధ్యలోకి విశాల్ పేరు.. ఇలా కోలీవుడ్ మీదా కాన్సన్ ట్రేట్ చేసింది. టాలీవుడ్ గురించి చెబితే జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదని కోలీవుడ్ జనాల పేర్లను తెరపైకి తెస్తున్నట్టుగా ఉంది.
ఇప్పుడు తమిళ మీడియాకు మంచి మసాలా దొరికినట్టే. అయితే ఈమెకు భాష రాదు కాబట్టి అక్కడి టీవీ చానళ్లు బైట్స్ తీసుకోలేవేమో. అయినా ఇక్కడ మరో ధర్మసందేహం ఏమిటంటే.. విడతల వారీగా ఒక్కోక్కరి పేర్లూ ఎందుకు వెల్లడిస్తున్నట్టు? లారెన్స్, సుందర్.సిలు ఈమెకు మొదటి రోజే గుర్తుకు రాలేదా? అందరి పేర్లూ ఒకే రోజు చెప్పేస్తే మూడో రోజు నుంచి తనను అంతా మరిచిపోతారని.. దశలవారీగా, విడతల వారీగా.. ఈ పేర్లను బయటపెడుతున్నట్టా? ఈమెలో నటి ఏమో కానీ మంచి స్క్రిప్ట్ రైటింగ్ టాలెంట్ అయితే ఉన్నట్టుంది.