Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ ప్రయత్నం బహుళార్థకం?

బన్నీ ప్రయత్నం బహుళార్థకం?

ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ఏమిటంటే, వీలయినంత మంచి గా కనిపించడం. అందరితొ కలిసిమెలసి వున్నామనే లుక్, ఫీల్ కలిగించడం. ఇది అందరు హీరోలు, డైరక్టర్లు పాటిస్తున్న సంగతి. ఇప్పుడు ఇండస్ట్రీకి ప్రత్యేకంగా పెద్ద దిక్కు లేరు. ప్రమోషన్ కు ఎవరు ఎవర్నయినా పిలుచుకోవచ్చు. ఎవరు పిలిచిని వెళ్లవచ్చు. కాస్త ‘లింక్’ పట్టుకోవాలి అంతే.

 విజేత విజయోత్సహం నిన్న జరిగింది. స్టయిలిష్ స్టార్ బన్నీ స్పెషల్ గా హాజరయ్యారు. సినిమాను ప్రమోట్ చేయడానికి తన సాయం తను చేసారు. కచ్చితంగా మెచ్చుకోవాల్సిన సంగతే. ఎందుకంటే కాస్త మంచి పాయింట్, మంచి విషయం, క్లీన్ మేకింగ్ వున్న సినిమాను ప్రమోట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా మంచిదే.

అయితే బన్నీ ఈ సినిమా ఫంక్షన్ కు రావడానికి వెనుక బహుళార్థక ప్రయోజనాలు వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగిందని వదంతులు అనేకం వచ్చాయి. ‘చెప్పను బ్రదర్’ లాంటి వివాదాలు, ఆపై అవన్నీ సినిమాల మీద ప్రభావం చూపించడం జరిగింది.

అలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్ కు మీడియాకు మధ్య తలెత్తిన వివాదం టైమ్ లో బన్నీ ఆ చాన్స్ ను అందిపుచ్చుకుని, తనే అడుగు ముందుకేసారు. పవన్ తో బంధం గట్టి చేసుకున్నారు. అలాగే రంగస్థలం టైమ్ లో ఆ పాటలు, తన కొడుకు లుంగీ ఫోటోలు ఇవన్నీ షేర్ చేసి, అటు మెగా ఫ్యామిలీకి కూడా మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ సినిమాను ప్రమోట్ చేయడం ద్వారా ఆ బంధం మరింత గట్టి చేసుకున్నారు.

వీటన్నింటికీ అతీతంగా సాయి కొర్రపాటి వారాహి బ్యానర్ లో సినిమా చేయాలని వుంది అని నిన్న ప్రకటించడం వెనుక కాస్త గట్టి పరమార్థమే వుందనిపిస్తోంది.. రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాలన్నది బన్నీ చిరకాల కోరిక. అది నెరవేరడం లేదు. బాహుబలి సిరీస్ తరువాత అవకాశం కోసం  కొంచెం ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. రాజమౌళితో ఓ సందర్భంలో స్టేజ్ షేర్ చేసుకున్నపుడు, ఆయన పట్ల తన అభిమానం, గౌరవం అన్నీ బన్నీ ప్రసంగంలో తొంగి చూసాయి కూడా. ఇక సాయి కొర్రపాటి అంటే రాజమౌళికి అత్యంత ఆప్తుడు అన్న సంగతి తెలిసిందే.

అందువల్ల రాజమౌళి ఆప్తుడు అయిన సాయి కొర్రపాటికి సరైన సమయంలో సాయం చేస్తే, అది ఊరికే పోదు. పైగా అదే వేదిక మీద తను సినిమా చేసే కోరిక కూడా ప్రకటించేసారు. ఆ విధంగా రాజమౌళికి కూడా దగ్గర కావచ్చు. మొత్తం మీద మంచి స్ట్రాటజీలతోనే ముందుకు వెళ్తున్నాడు బన్నీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?