అక్టోబర్ 18న రామ్ సినిమా

ఈ ఏడాది సెకండాఫ్ కాస్త డల్ గా వుంటుందేమో అనుకుంటే, అది కూడా ఫుల్ అయిపోతోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఒక్కటే పెద్ద సినిమా అనుకుంటే నవంబర్ నెలాఖరులో రోబో-2 సినిమా డేట్ వచ్చింది. దీంతో…

ఈ ఏడాది సెకండాఫ్ కాస్త డల్ గా వుంటుందేమో అనుకుంటే, అది కూడా ఫుల్ అయిపోతోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఒక్కటే పెద్ద సినిమా అనుకుంటే నవంబర్ నెలాఖరులో రోబో-2 సినిమా డేట్ వచ్చింది. దీంతో మిగిలిన సినిమాలు కూడా చకచకా డేట్ లపై రుమాళ్లు వేస్తున్నాయి.

అసలే శైలజారెడ్డి అల్లుడు-సవ్యసాచి డేట్ ల కోసం కిందామీదా అవుతున్నాయి. ఏదో ఒకటి అక్టోబర్ లోకి రావాలి. ఎందుకంటే సెప్టెంబర్ లో నాని-నాగ్ సినిమా వుంది. అందుకే మిగిలిన సినిమాలు కూడా డేట్ లు ఫిక్స్ చేసుకుంటున్నాయి.

రామ్-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో తయారవుతున్న దిల్ రాజు సినిమా 'హలో గురూ ప్రేమ కోసమే' కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 18న సరిగ్గా దసరా టైమ్ లో ఆ సినిమాకు డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్ కు వారం ముందుగా ఎన్టీఆర్ -త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 11న వస్తుంది. అంటే అక్టోబర్ ఫుల్ అయిపోయినట్లే.

ఎందుకంటే పెద్ద సినిమాకు వారం ముందుగా ఎవ్వరూ పెద్దగా సినిమాలు వేయరు. ఇప్పటికే ఆల్ మోస్ట్ ఆగస్ట్ ఫుల్ అయింది. సెప్టెంబర్ లో కొంత ఖాళీ వుంది.