Advertisement


Home > Movies - Movie Gossip
ఆ రెండూ.. ఇటు సాక్ష్యం

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భారీ సినిమా సాక్ష్యం. ఈ సినిమా సోలో డేట్ కోసం చూసి, చూసి, ఈనెల 27న వస్తోంది. అయితే అదే వీక్ మరికొన్ని చిన్న సినిమాలు ప్లాన్ చేసుకోవడం విశేషం. మామూలుగా అయితే చిన్న సినిమాలను పట్టించుకోరు. కానీ ఇక్కడ వస్తున్న రెండు చిన్న సినిమాలకు పెద్ద బ్యానర్ల దన్నువుంది.

ఒకటి హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్-కొణిదెల నీహారిక కాంబినేషన్. యూవీ క్రియేషన్స్ అండ, సమర్పణతో వస్తోంది ఈ సినిమా. అందువల్ల పబ్లిసిటీ, థియేటర్లు వ్యవహారం కాస్త గట్టిగానే వుంటుంది.

ఇక రెండోది చి.ల.సౌ. ఈ సినిమాలో సుశాంత్ హీరో. కానీ రాహుల్ రవీంద్రన్ తొలి దర్శకత్వపు సినిమా. అన్నపూర్ణ, నాగచైతన్య, సమంత లాంటి వాళ్ల అండ. అందువల్ల సోషల్ నెట్ వర్క్ లో ఆ క్రేజ్, అండ వేరుగా వుంటుంది.

ఇప్పడు ఈ రెండు సినిమాలతో సాక్ష్యం సినిమా పోటీపడాలి. ఈ మధ్య పెద్ద సినిమాలతో పోటీపడిన చిన్న సినిమాలు గెలవడం కనిపిస్తోంది. మరి ఇప్పుడెలా వుంటుందో చూడాలి.