మారుతి ‘బ్రాండ్’ @ కోటి ?

డైరక్టర్ మారుతి తెలివైన వారే కాదు, నిమిషం వృధా చేయరు. ఓ పక్క సినిమాలు డైరక్ట్ చేస్తూనే, కాన్సెప్ట్ లు ఇవ్వడం బ్యానర్ ఇవ్వడం, సినిమాలు ప్రొడక్షన్  చేసిపెట్టడం, ఇలా ఎక్కడ అవకాశం వుంటుందో…

డైరక్టర్ మారుతి తెలివైన వారే కాదు, నిమిషం వృధా చేయరు. ఓ పక్క సినిమాలు డైరక్ట్ చేస్తూనే, కాన్సెప్ట్ లు ఇవ్వడం బ్యానర్ ఇవ్వడం, సినిమాలు ప్రొడక్షన్  చేసిపెట్టడం, ఇలా ఎక్కడ అవకాశం వుంటుందో అక్కడ ఏదో ఒకటి చేస్తూనే వుంటారు. ఆయన తొలిసారి ఓ బౌండ్ స్క్రిప్ట్ ను వేరే డైరక్టర్ కు, నిర్మాతకు ఇచ్చారు.

సాధారణంగా కథ ఇస్తే ఆ రైటర్ రేంజ్ ను బట్టి కోటి వరకు పలుకుతుంది టాలీవుడ్ లో. మరి డైరక్టర్ మారుతి కథ ఇచ్చారు అంటే ఆ గుడ్ విల్ కొంతయినా వుంటుంది. పైగా కథతో పాటు స్క్రీన్ ప్లే మాటలు కూడా అందించారు. పనిలో పని తన బ్యానర్ ఇచ్చారు. ఇంకా ముందుకు వెళ్లి ప్రొడక్షన్ చేసిపెట్టారు.

వీటన్నింటికి కలిపి మారుతి చార్జ్ చేసిన ఫీజు కోటి రూపాయలు అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదంతా బ్రాండ్ బాలు సినిమా వ్యవహారమే. కన్నడ రంగంలో పేరున్న నిర్మాత శైలేంద్ర బాబు తన కొడుకు సుమంత్ శైలేంద్రను హీరోగా పరిచయం చేస్తున్నారు. దీనికి బ్యానర్ కథ, మాటలు, నిర్మాణ బాధ్యతలు మారుతివే.

డైరక్టర్ ఈటీవీ ప్రభాకర్. ఇందుకు గాను మారుతికి ఫీజ్ కింద ఇచ్చిన అమౌంట్ కోటి అని ఇండస్ట్రీ బోగట్టా. ఒక విధంగా చూసుకుంటే తక్కువే అనుకోవాలి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది. మారుతి బ్రాండింగ్ తో మీడియా మొత్తం ఫుల్ కవరేజ్ ఇచ్చింది. ఇధంతా కూడా అందులో పార్ట్ నే కదా?