దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు విడుదల డేట్ కూడా ఫిక్సయిపోయింది. మానవ సంబంధాలు, ఆర్ధిక సంబంధాలు వీటిలో దేనికి ప్రాముఖ్యత అన్న పాయింట్ ను బేస్ చేసుకుని తయారవుతున్న సినిమా. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం పల్లెటూరులో జరిగే పెళ్లి హడావుడే వుంటుందని ముందుగా తెలిసింది.
అయితే ఒక పెళ్లికాదట. సినిమా మొత్తం మూడు పెళ్లిళ్లు వుంటాయట. క్లయిమాక్స్ లో జరిగేది హీరో హీరోయిన్ల పెళ్లి అన్నమాట. ఈ మూడు పెళ్లిళ్లకు కలిపి పెళ్లి పరమార్థంపై మాంచి అర్థవంతమైన పాట రాయించారు. శతమానం భవతి సినిమాలో ఎస్పీ బాలు చేత పాట పాడించినట్లే, ఈ సినిమాలో కూడా ఆ పాటను బాలు చేత పాడించారు.
ఈ సినిమాలో పెళ్లిళ్ల టైమ్ లో ఈ సాంగ్ రన్ అవుతూ వుంటుదన్నమాట. ప్రకాష్ రాజ్ ను కీలకపాత్రలో తీసుకుని మానవ సంబందాల నేఫథ్యంలో ఇప్పటికి దిల్ రాజు మూడుసినిమాలు నిర్మించారు. బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో.. శతమానం భవతి. ఆ వరుసలో ఇది నాలుగోది.