‘కాలా’ ఫ్లాప్ అంటే ఒప్పుకోరట!

ట్రేడ్ వర్గాలు చెప్పే నంబర్లను బట్టి రజనీకాంత్ ‘కాలా’ ఒక డిజాస్టర్. ఈ సినిమాను ప్రీ రిలీజ్ మార్కెట్లో 230 కోట్ల రూపాయలకు అమ్మారు. అయితే బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం కాలా ఈ రేంజ్…

ట్రేడ్ వర్గాలు చెప్పే నంబర్లను బట్టి రజనీకాంత్ ‘కాలా’ ఒక డిజాస్టర్. ఈ సినిమాను ప్రీ రిలీజ్ మార్కెట్లో 230 కోట్ల రూపాయలకు అమ్మారు. అయితే బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం కాలా ఈ రేంజ్ సినిమాగా నిలబడలేదు. ఈ సినిమా గ్రాస్ వసూళ్లలో కూడా వంద కోట్ల రూపాయల నంబర్ మాత్రమే వినిపించింది. ఆ తర్వాత ఈ సినిమా రూపకర్తలు కూడా వసూళ్ల గురించి ప్రకటన ఏమీ చేయలేదు. దీంతో ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అని అంతా అనుకున్నారు. ఈ మేరకు తమిళ మీడియా వర్గాలు కూడా రజనీకాంత్ సినిమా డిజాస్టర్ అని తేల్చేశాయి.

కానీ అలా అంటే తాము ఒప్పుకోమని అంటున్నారు కాలా నిర్మాతలు. ఈ సినిమాను నిర్మించింది మరెవరో కాదు కదా, రజనీ అల్లుడే. స్వీయ నిర్మాణంలో రజనీ అల్లుడు తన మామతో సినిమాను తీశాడు. ఇది కమర్షియల్ గా ఫెయిల్ అంటే అతడు ఒప్పుకోవడం లేదు.

కాలా సినిమా సూపర్ హిట్ అని, కమర్షియల్‌గా కూడా ఫెయిల్ కాలేదని, తాము ఈ సినిమాతో నష్ట పోలేదని ధనుష్ స్పష్టం చేస్తున్నాడు. అయినా నిర్మాతకు ఎందుకు వస్తాయి నష్టాలు? డిస్ట్రిబ్యూటర్లకు కదా నష్టాలు వచ్చేది. రెండు వందల కోట్ల రూపాయల స్థాయికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముకున్నారు. తద్వారా రజనీకాంత్ కు రెమ్యూనరేషన్ బాగానే ముట్టి ఉంటుంది. ఇక నిర్మాత అయిన అల్లుడికి కూడా బాగానే డబ్బు వచ్చి ఉంటుంది. ఆ పై టీవీ రైట్స్ ను కూడా భారీ ధరకు అమ్ముకున్నారు. సో.. లాభాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. పదుల కోట్ల రూపాయల్లో ఉంటాయి.

ఎటొచ్చీ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారి పరిస్థితే ఏమిటో తెలియడం లేదు. కొన్నేళ్లుగా ‘కబాలి’ని మినహాయిస్తే రజనీ కాంత్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు బాగా లాస్ అవుతూ వస్తున్నాయి. ‘కొచ్చాడయాన్’ నష్టాల వ్యవహారం ఇప్పటికీ రజనీకాంత్ కుటుంబాన్ని కోర్టుకు లాగుతోంది. ఆ తర్వాత లింగా డిస్ట్రిబ్యూటర్ల రచ్చ కూడా గట్టిగానే సాగింది. ‘కాలా’ పరిస్థితి లింగా కన్నా దారుణమని ట్రేడ్ వర్గాలు అంటున్నా, రజనీ కుటుంబం మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు.