సినిమా సినిమాకు జోనర్ మార్చడం అన్నది డైరక్టర్ విక్రమ్ కుమార్ స్టయిల్. మాంచి ఫీల్ గుడ్ యూత్ లవ్ ఎంటర్ టైనర్లు చేయగలడని, ఏ జోనర్ సినిమా తీసినా పేరు తెచ్చకున్నాడు. కానీ కాన్ ప్లిక్ట్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ సినిమాలు చేస్తూ రావడంవల్ల, ఫుల్ రీచ్, ఫుల్ మార్కెట్ రావడంలేదు.
అందుకే ఈసారి అలాకాకుండా ఓన్లీ మాస్ ఎంటర్ టైనర్ చేయాలని విక్రమ్ కుమార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ లేటెస్ట్ సినిమా హీరోతో బన్నీతో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే స్క్రిప్ట్ లాక్ చేసారు.
బన్నీకి పక్కా కలిసి వచ్చిన జోనర్ కూడా ఇదే. అందుకే ఈసారి విక్రమ్ కుమార్ ఈ లైన్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శానం నాగఅశోక్ కుమార్, నల్లమలుపు బుజ్జి కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు.