శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ మహుర్తం ఈరోజే. ఉదయం 11.45కి విడుదల. మొన్నటికి మొన్న వదలాలనుకన్నా, అనివార్య కారణాల వల్ల వదలలేకపోయారు. ఆఖరికి అది కాస్తా లీకో, ఫేకో అయిపోయింది. ఈరోజు నిర్మాతలు సితార ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మొన్న లీక్ స్టిల్ నాగచైతన్య స్మార్ట్ లుక్ లో వున్నది వచ్చింది. ఇవ్వాళ కూడా నాగచైతన్య అల్లుడు లుక్ వస్తుంది. అది ఎలాగూ ఊహించేదే. కానీ కేవలం ఒక్క అల్లుడు లుక్ మాత్రమే ఇస్తారా? లేక అత్త రమ్యకృష్ణ లుక్ కూడా ఇస్తారా? అన్నది అనుమానం.
ఎందుకంటే శైలజారెడ్డి అల్లుడు సినిమాకు యూత్ పుల్లింగ్ పాయింట్ చైతూ అయితే, ఫ్యామీలీ పుల్లింగ్ పాయింట్ రమ్యకృష్ణనే. బాహుబలి తరువాత మళ్లీ రమ్యకృష్ణకు కాస్త కీలకమైన పాత్ర ఈ సినిమాలో వుంది. అందువల్ల ఫస్ట్ లుక్ లో అల్లుడుతో పాటు అత్త కూడా వుంటే ఆ క్రేజ్ నే వేరు. మరి లుక్ వస్తే కానీ ఏ వైనం తెలియదు.