హీరోగా ట్రయ్ చేయడం అన్నది కమెడియన్లు అందరికీ ఓ సరదా. అలనాటి రేలంగి, రాజబాబు దగ్గర నుంచి ఈనాటి శ్రీనివాసరెడ్డి, సప్తగిరి వరకు. అయితే కామెడీ చూసి ఆనందించి, అభిమానించే ప్రేక్షకులు, ఈ కమెడియన్లు హీరోచిత వేషాలు వేస్తే పక్కన పెడుతున్నారు. అది చూసి చూసి మళ్లీ వెనక్కు వచ్చి కామెడీ పాత్రలు వేస్తుంటారు.
కానీ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాసరెడ్డి కాస్త త్వరగానే సత్యం గ్రహించినట్లు కనిపిస్తోంది. మరి కొన్నాళ్లు పాటు కామెడీ పాత్రలే చేస్తానని అంటున్నారని తెలుస్తోంది. మరీ అద్భుతమైన సబ్జెక్ట్, ష్యూర్ షాట్ హిట్ అని అనిపించే స్క్రిప్ట్ వస్తే, అది కూడా ఓ ఏడాది తరువాతే, హీరో వేషం సంగతి ఆలోచిస్తానని, ప్రస్తుతానికి మాత్రం కామెడీ క్యారెక్టర్ల కు ప్రాధాన్యత అని అంటున్నాడట.
పంతం సినిమాలో హీరో పక్కన శ్రీనివాస రెడ్డి మళ్లీ తన స్టయిల్ పాత్రలో తళక్కున మెరిసాడు. అది చూసిన సన్నిహితులు ఈ తరహా పాత్రలే బెటర్ అనే సలహా ఇచ్చినట్లు వినికిడి. దాంతో ఆ విధంగానే ఫిక్సయినట్లు తెలుస్తోంది. శ్రీనివాసరెెడ్డి కోసం తయారుచేసిన ఓ స్క్రిప్ట్ ను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మంచి కమెడియన్ల కొరత వుంది. సునీల్, వెన్నెల కిషోర్ ఇద్దరే వున్నారు. పృధ్వీ మరీ అటు ఇటు కాకుండా వున్నారు. అందువల్ల శ్రీనివాస రెడ్డి మళ్లీ ఇటు వస్తే కెరీర్ బాగానే వుంటుంది.