అత్త.. అల్లుడు.. ఇద్దరూ సూపరే

శైలజరెడ్డి అల్లుడు అని టైటిల్ నే చెబుతుంది. ఆ క్యారెక్టర్ల ఇంటెన్సిటీ. మారుతి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లు బయటకు…

శైలజరెడ్డి అల్లుడు అని టైటిల్ నే చెబుతుంది. ఆ క్యారెక్టర్ల ఇంటెన్సిటీ. మారుతి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లు బయటకు వచ్చాయి. ముందుగా వెల్లడించినట్లే, లుక్ కాదు, లుక్ లు వచ్చాయి. అత్త, అల్లుడు, కూతురు కలిసిన లుక్ ఒకటి, అల్లుడిగారి సోలో లుక్ ఒకటి వదిలారు.

సరే అల్లుడిగా, నాగ్ చైతన్య లుక్ మొన్నటికి మొన్నే లీక్ పిక్చర్ లో చూసేసాం. అందువల్ల దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. కానీ అత్త, కూతురు, అల్లుడు కలిసిన ఫ్యామిలీ పిక్ మాత్రం సూపర్ గా వుందనే చెప్పాలి. అత్త, అల్లుడు అన్నది టాలీవుడ్ హిట్ ఫార్ములా. మళ్లీ దాన్ని మరోసారి ప్రూవ్ చేయబోతున్నారు దర్శకుడు మారుతి. 

ఈ ఫార్ములా ఆ ఫస్ట్ లుక్ లో క్లియర్ గా కనిపించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ హిల్లేరియస్ ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్ట్ తో చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ రమ్యకృష్ణలతో కలిసి చేస్తున్న సినిమాకు వదిలిన ఈ ఫ్యామిలీ పిక్ మాత్రం వైరల్ అవుతుంది. ఎందుకంటే రమ్యకృష్ణకు వున్న క్రేజ్ అలాంటిది మరి.