రవితేజ, నాగచైతన్య, సాయిధరమ్ తేజ, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు (శ్రీమంతుడుకి ముందు) శ్రీనువైట్ల, సంతోష్ శ్రీనివాస్, కిషోర్ తిరుమల, సుకుమార్ (రంగస్థలానికి ముందు) ఇదీ మైత్రీమూవీస్ లో హీరోలు, డైరక్టర్ల జాబితా. ప్రతి ఒక్కరూ పరాజయాలతో వున్నవారే. హిట్ ల కోసం చూస్తున్నవారే. ఇప్పటికి ఇద్దరే గట్టెక్కారు. మహేష్ బాబు, సుకుమార్. వాళ్లకు మైత్రీ టచ్ కలిసి వచ్చింది. ఇక మిగిలిన వారి సంగతి తేలాలి.
వీళ్లందరి కెరీర్ కొత్తగా చెప్పనక్కరలేదు. ప్రతి హీరో ఒకటి రెండుఫ్లాపుల్లో వున్నారు. ప్రతి డైరక్టర్ హిట్ కోసం మొహం వాచి వున్నారు. ఒక్క చందుమొండేటి మాత్రమే ప్రేమమ్ హిట్ ఇచ్చి, మైత్రీలోకి వచ్చారు. యాక్ట్యువల్ గా కృష్ణార్జునయుద్దం తరువాత నాని సినిమా కూడా మైత్రీలో వుండాల్సింది, తప్పిపోయింది. అలాగే పవన్ సినిమా కూడా వుండాల్సిందే. అదీ మిస్సయింది.
వాస్తవానికి పెద్దహీరోలు, పెద్ద డైరక్టర్లు అని రంగంలోకి దిగిన మైత్రీమూవీస్, ఎక్కువ ప్రాజెక్టులు చేసే ఆలోచనతో చకచకా ప్రాజెక్టులు కుదుర్చుకుంది. ఇప్పడు అవన్నీ ఎలా మెటీరియలైజ్ అవుతాయో? ఇదిలా వుంటే మహేష్ బాబు-సుకుమార్, బోయపాటి-బాలయ్య, త్రివిక్రమ్-? సినిమాలు కూడా ప్లానింగ్ లో వున్నాయి. అవే మైత్రీకి శ్రీరామరక్ష అనుకోవాలేమో?