విజయ్ దేవరకొండ.. అడల్ట్స్ ఓన్లీగా మిగిలిపోతాడా?

తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘అర్జున్ రెడ్డి’ కచ్చితంగా ప్రత్యేకమైన సినిమానే. మనోళ్లు గట్టిగా అనుకుంటే.. హాలీవుడ్ స్థాయి (గ్రాఫిక్సో, భారీతనమో హాలీవుడ్ స్థాయికి ప్రామాణికం కాదు సుమా) కథా, కథాంశాలతో సినిమాలు చేయగలరు…

తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘అర్జున్ రెడ్డి’ కచ్చితంగా ప్రత్యేకమైన సినిమానే. మనోళ్లు గట్టిగా అనుకుంటే.. హాలీవుడ్ స్థాయి (గ్రాఫిక్సో, భారీతనమో హాలీవుడ్ స్థాయికి ప్రామాణికం కాదు సుమా) కథా, కథాంశాలతో సినిమాలు చేయగలరు అని నిరూపించిన సినిమా అది. హాలీవుడ్ డార్క్ కామెడీలకు ఏమాత్రం తీసిపోని రీతి సినిమా అర్జున్ రెడ్డి. ఆ ప్రయోగం అదరగొట్టింది.

అర్జున్ రెడ్డి తర్వాత ఏమిటి? అంటే ఆ సినిమా రూపకర్త దగ్గర నుంచి ఇంకా సమాధానం లేదు కానీ, విజయ్ దేవరకొండ మాత్రం ఆ మూసలో సాగిపోతున్నట్టుగా ఉన్నాడు. విజయ్ బయట మాట్లాడే తీరు, ఆ తెగువ… అంతా అర్జున్ రెడ్డి నుంచి అందిపుచ్చుకున్నట్టుగానే ఉంది. ఈ సినిమాకు ముందు విజయ్ ఏమిటనేది ఎవరికీ తెలీదు. ఈ సినిమా దగ్గర నుంచి అతడి తీరును సోషల్ మీడియాలో గమనించినా.. వాస్తవంలో కూడా అర్జున్ రెడ్డిలా సాగిపోతున్నాడేమో అనిపిస్తుంది.

ఇక అతడు చేస్తున్న ఇతర సినిమాలు.. ఇంకా ఏదీ రిలీజ్ కాదనుకోండి. మహానటి తప్ప. ఇంకో సినిమా కూడా వచ్చింది కానీ, అది బ్యాగ్‌లాగ్. తాజాగా ఈ హీరో సినిమా ‘గీతగోవిందం’కు సంబంధించిన పోస్టర్ కూడా యమహాట్ గా ఉంది. ఈ పోస్టర్ లో పెట్టిన క్యాప్షన్‌ను చూస్తే ఇది కేవలం విజయ్ దేవరకొండకు ఇండికేషనేమో అనిపించకమానదు. విజయ్ హీరోగా ఉంటే.. ఇలాంటి డైలాగులే ఉండాలన్నట్టుగా అనుకుంటున్నారా? లేక కోఇన్సిడెంట్‌గా ఇలాంటి డైలాగులు పెడుతున్నారా? ఎందుకిలా జరిగినా.. గీతగోవిందంలో కూడా ‘ఎఫ్ వర్డ్స్’ గట్రా ఎక్కువగా ఉంటే.. అంతా కలిసి విజయ్‌ను అడల్ట్స్ ఓన్లీ మెటీరియల్‌గా మిగులుస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది.