శ్రీనివాసకళ్యాణం డేట్ ఫిక్స్

దిల్ రాజు ఇప్పడు నిర్మిస్తున్న సినిమాల్లో చాలా ఆసక్తిగా ఫీలవుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి సినిమాల మాదిరిగా తమ సంస్థకు మంచి పేరు తెస్తుందని దిల్…

దిల్ రాజు ఇప్పడు నిర్మిస్తున్న సినిమాల్లో చాలా ఆసక్తిగా ఫీలవుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి సినిమాల మాదిరిగా తమ సంస్థకు మంచి పేరు తెస్తుందని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే ఆయన దగ్గర వుండి అత్యంత శ్రద్ధగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను తనకు అత్యంత ఇష్టమన బొమ్మరిల్లు డేట్ ఆగస్టు 9నే విడుదల చేయాలని భావించారు.

కానీ చాలా సినిమాలు అటు ఇటు డేట్ లు పెడుతూ వచ్చాయి. ఆఖరికి అందరితో డిస్కస్ చేసి, శ్రీనివాస కళ్యాణం సినిమాకు దిల్ రాజు సోలో డేట్ సంపాదించారు. ఆగస్టు 9న శ్రీనివాస కళ్యాణం విడుదలవుతుంది. ఆగస్టు 15న విజయ్ దేవరకొండ గీత గోవిందం విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలకు ముందుగా జూలై 20న రాజ్ తరుణ్ లవర్, 27 బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం విడుదలవుతాయి. 

ఇవన్నీ దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సినిమాలే. వాస్తవానికి 27న విడుదలయ్యే హ్యాపీ వెడ్డింగ్ సినిమాకు కూడా దిల్ రాజే చూడాలి వ్యవహారాలు. ఎందుకుంటే అది కూడా దిల్ రాజుతో మంచి సంబంధాలు వున్న యూవీ వాళ్ల సినిమా. చిత్రమేమిటంటే ఇంతగా మీడియం, చిన్న సినిమాల పొటీవున్నా ఆగస్టు 3న మాత్రం వదిలేసారు. ఆ రోజు అడవి శేష్ గూఢచారి సినిమా వుండే అవకాశం వుంది.