శైలజారెడ్డి అల్లుడు-సవ్వసాచి సినిమాల్లో ఏది ముందు వస్తుంది? ఏదివెనుక? ఇప్పుడు ఈ వ్వవహారం చైతూ తండ్రి నాగార్జున కోర్టులోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడో డిసెంబర్ లో ప్రారంభం అయిన సవ్యసాచి షూటింగ్ ఇంకా పదిరోజులు బకాయి వుంది. దానికి రెండునెలలు వెనుగ్గా ప్రారంభమైన శైలజారెడ్డి అల్లుడు సినిమా చకచకా పూర్తయిపోతోంది. ఈనెల 20తో ఒకపాట మినహా మొత్తం పూర్తయిపోతుంది.
ఇలాంటి టైమ్ లో పదిరోజులు తమకు అడ్జస్ట్ చేస్తే, సినిమా ఫినిష్ చేసి ఆగస్టు 3కు విడుదల చేసేస్తామని సవ్యసాచి టీమ్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అందుకు అవకాశమే లేదని, ఈనెల 20దాకా వున్న డేట్లు అన్నీ రమ్యకృష్ణతో సహా అనేకమంది సీనియర్ల యాక్టర్ల కాంబినేషన్ లు సెట్ చేసకున్నామని శైలజారెడ్డి టీమ్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న నాగ్ చైతన్యకు సవ్యసాచి టీమ్ కు మధ్య మీటింగ్ జరిగింది. సినిమాలో తాము అనుకున్న చేంజెస్, బకాయి వర్క్, ఇప్పటివరకు అయిన వర్క్ ఇవన్నీ ఈ మీటింగ్ లో డిస్కషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. తమకు పదిరోజులు డేట్లు ఇస్తే, రెడీ అయిపోతామని చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నీ విన్న చైతన్య, చేంజెస్ ఇతరత్రా వ్యవహారాలు అన్నీ తండ్రి నాగ్ కు చెబుతా అని, ఆయన ఓకే అంటే ఇప్పటిదాకా తీసిన ప్రొడెక్ట్ ఓసారి చూపిద్దామని, అన్నీ ఓకె అంటే, డేట్ లు అడ్జస్ట్ చేస్తానని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. కానీ అలా డేట్ లు ఇవ్వాలన్నా జూలై 20లోపు సాధ్యంకాదని తెలుస్తోంది. తమకు జూలై 10 నుంచి డేట్ లు వున్నాయని సవ్యసాచి టీమ్ చెబుతున్నది వాస్తవం కాదని, శైలజారెడ్డి అల్లుడు యూనిట్ వర్గాల బోగట్టా.
ఇదిలా వుంటే ఇప్పుడు కొత్త గ్యాసిప్ తెరపైకి వచ్చింది. ఆగస్టు నెలాఖరుకు సవ్యసాచి అని. ఇదే శైలజారెడ్డి అల్లుడు టీమ్ కు మరింత మండిస్తోందని వినికిడి. ఎందుకంటే ఆ డేట్ ను ఏప్పుడో రెండునెలల క్రితమే వాళ్లు ముహుర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. కావాలంటే ఏదో విధంగా ఆగస్టు 3న సవ్యసాచి రావచ్చని, అంతేకానీ తమ డేట్ కబ్జా చేయడం సరికాదని శైలజారెడ్డి అల్లుడు మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంమీద చూస్తుంటే ముడి బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఒకటి మాత్రం పక్కా నాగ్ కోర్టులోకి సవ్యసాచి వెళ్తే మాత్రం ఆగస్టులో విడుదల కష్టంకావచ్చు. ఎందుకంటే క్వాలిటీ దగ్గర, స్క్రిప్ట్ దగ్గర నాగ్ అంత సులువుగా రాజీపడడు. ఆందరినీ ఆర్జీవీ మాదిరిగా వదిలేయడు.