కేసీఆర్ తెగింపు బాబుకు ఎప్పటికీ రాదు

ఏ విషయంలోనోనైనా చటుక్కున నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి చాలాముందు వున్నారు. ఆ విషయంలో ఆంధ్ర సీఎం బాబు ఎప్పటికైనా వెనుక అడుగే. ప్రతి నిర్ణయంలోనూ. ఓట్లు లెక్క పెట్టుకొవడంతోనే సరిపోతోంది చంద్రబాబుకి. ఇప్పుడు…

ఏ విషయంలోనోనైనా చటుక్కున నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి చాలాముందు వున్నారు. ఆ విషయంలో ఆంధ్ర సీఎం బాబు ఎప్పటికైనా వెనుక అడుగే. ప్రతి నిర్ణయంలోనూ. ఓట్లు లెక్క పెట్టుకొవడంతోనే సరిపోతోంది చంద్రబాబుకి. ఇప్పుడు లేటెస్ట్ గా కత్తి మహేష్ ఉదంతం కూడా అలాంటిదే. హిందువులకు ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు సినీ విమర్శకుడు కమ్ పొలిటికల్ యాస్పిరెంట్ కత్తి మహేష్. దీనిమీద హిందూసంఘాలు అన్నీ మండిపడ్డాయి.

హిందూ స్వామీజీలు అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. కేవలం హైదరాబాద్ లోనే కాదు, ఆంధ్రలో కూడా చాలాచోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. కానీ చంద్రబాబు అస్సలు రియాక్ట్ కాలేదు. కారణాలు రెండు. ఒకటి ఇప్పుడిప్పుడే భాజపాకు దూరమై, భాజపాను భూతంలా చూపిస్తూ, యాంటీ హిందూ ఓట్ల కోసం కిందామీదా అవుతున్నారు చంద్రబాబు. ఇంకో కారణం. కత్తి మహేష్ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా దూరంకాకూడదు. అందుకే బాబు సైలంట్ గా వున్నారు.

కానీ ఈ రెండు తరహా కారణాలు ఆంధ్రలో కన్నా తెలంగాణలో కీలకం. అటు యాంటీ హిందూ ఓట్లు కానీ, ఇటు కత్తి మహేష్ సామాజికవర్గ ఓట్లు కానీ ఎక్కువ ప్రభావం చూపించేది తెలంగాణలోనే. అయినా కూడా కేసీఆర్ చురుగ్గా కదిలారు. ఆయన దృష్టికి రాకుండా, ఆయనకు చెప్పకుండా, పోలీసులు కత్తి మహేష్ వ్యవహారంపై ముందుకు కదిలి వుంటారని అనుకోవడానికి లేదు. ఆ లెక్కన కేసీఆర్ నిజంగా ఫాస్ట్ డెసిషన్ మేకర్ అనుకోవాల్సిందే.