ఉగాదికి డేట్ ఇచ్చిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మాంచి స్పీడుగా వున్నాడు. 2019 ఉగాదికి తన 25వ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసాడు. సినిమా నిర్మాణ సంస్థ ఈ మేరకు ట్విట్టర్ లో డేట్ ను ప్రకటించేసింది.…

సూపర్ స్టార్ మహేష్ బాబు మాంచి స్పీడుగా వున్నాడు. 2019 ఉగాదికి తన 25వ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసాడు. సినిమా నిర్మాణ సంస్థ ఈ మేరకు ట్విట్టర్ లో డేట్ ను ప్రకటించేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు పీవీపీ, దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి మహేష్ బాబు 25వ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ సెకెండ్ వీక్ లో డెహ్రాడూన్ లో షూట్ స్టార్ట్ చేసుకుంది.

సినిమా స్టార్ట్ చేసిన 15 రోజుల్లోనే విడుదల డేట్ ను ప్రకటించడం విశేషం. అంటే సుమారు తొమ్మిది నెలల్లో సినిమా విడుదలకు రెడీ అవుతుందన్నమాట. వాస్తవానికి వంశీపైడిపల్లి లాంటి ఇంటలెక్చ్యువల్ దర్శకుడు సినిమా నిర్మాణానికి కాస్త ఎక్కవ టైమ్ తీసుకుంటారు. కానీ చకచకా షూట్ ప్లాన్ చేయడం, విడుదల డేట్ ప్రకటించడం అంటే, వెనుక నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు హ్యాండ్ కూడా వుందనుకోవాలి.

2019 సంక్రాంతికి రామ్ చరణ్ –బోయపాటి సినిమా వుంది. చిరంజీవి సైరా సినిమా సమ్మర్ విడుదల అంటున్నారు. మరి ప్రభాస్ సాహో సినిమా సంగతేమిటో చూడాలి. సంక్రాంతి, ఉగాది, సమ్మర్ బుక్ అయిపోయాయి. దాన్నేం చేస్తారో? బహుశా ఈ సినిమాలన్నీ దృష్టిలో వుంచుకునే మహేష్ సినిమా డేట్ అర్జెంట్ గా ప్రకటించారని అనుకోవాలేమో? ఈ సినిమా తరువాత మహేష్ డైరక్టర్ సుకుమార్ సినిమా చేయాల్సి వుంది.