విశాఖకు జగన్… కౌంట్ డౌన్ స్టార్ట్

విశాఖకు జగన్‌కి మధ్య ఒక తెలియని ప్రేమానుబంధం అలా సాగుతూనే ఉంది. విశాఖ అంటే జగన్ కి ఇష్టం. సిటీ ఆఫ్ డెస్టినీ ని రాజధానిగా చేసుకుని పాలించాలని జగన్ కల ఆలోచన. దాని…

విశాఖకు జగన్‌కి మధ్య ఒక తెలియని ప్రేమానుబంధం అలా సాగుతూనే ఉంది. విశాఖ అంటే జగన్ కి ఇష్టం. సిటీ ఆఫ్ డెస్టినీ ని రాజధానిగా చేసుకుని పాలించాలని జగన్ కల ఆలోచన. దాని కోసం ఆయన మూడు రాజధానుల పేరిట చట్టాన్ని చేసి తరువాత ఎందుకో ఉపసంహరించుకున్నారు. 

అమరావతి రాజధాని వివాదం సుప్రీం కోర్టులో ఉంది. న్యాయ పరమైన ఇబ్బందులకు తావు లేకుండా ఉండాలీ అంటే మరో తరుణోపాయం ఉంది. దాన్ని ఇపుడు వైసీపీ అమలు చేయబోతోంది. 

జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖకు మార్చడాన్ని టెక్నికల్ గా ఎవరూ తప్పుపట్టలేరు. అది చెల్లుతుంది. అందుకే ఆ దిశగా వైసీపీ ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి.

ఆ విషయాన్ని మంత్రి గుడివాడ అమరనాధ్ వెల్లడించారు. జగన్ విశాఖకు దసరా నాటికి రాబోతున్నారు అని ఆయన పార్టీ మీటింగులో సంచలన ప్రకటన చేశారు. విశాఖ వాసుల కోరిక ఆ విధంగా నెరవేరబోతోంది అని మంత్రి అంటున్నారు.

జగన్ విశాఖకు రావడం పక్కా అని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. జగన్ విశాఖకు దసరాకు రావడం ద్వారా పాలనను స్మార్ట్ సిటీకి తేబోతున్నారు అని అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ తరలివచ్చిందంటే పాలన పూర్తిగా విశాఖకు బదిలీ అయినట్లే అని అంటున్నారు.

విశాఖ రాజధాని అని హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి విశాఖకు వస్తున్నారు అని వైసీపీ మంత్రులు కీలక నేతలు చెబుతున్నారు. ఈసారి దసరా పక్కా అని అంటున్నారు. ఇప్పటికి చూస్తే రెండు నెలల సమయం ఉంది. అంటే జగన్ విశాఖ మకాం కి ఈ అరవై రోజులలో వ్వవధికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే.