మహేష్ ఇప్పుడూ అలాగే అనగలరా?

అబద్దం ఆడడం వేరు. తప్పించుకోవడం వేరు. తెలియదని చెప్పడం వేరు. బుకాయించడం వేరు. వంశీ పైడిపల్లి సినిమా విషయంలో హీరో మహేష్ బాబు ఈ చివరి ఆప్షన్ ను ఎంచుకున్నారు. భరత్ అనే నేను…

అబద్దం ఆడడం వేరు. తప్పించుకోవడం వేరు. తెలియదని చెప్పడం వేరు. బుకాయించడం వేరు. వంశీ పైడిపల్లి సినిమా విషయంలో హీరో మహేష్ బాబు ఈ చివరి ఆప్షన్ ను ఎంచుకున్నారు. భరత్ అనే నేను సినిమా విడుదల టైమ్ లో మీడియాతో ఆయన ఇంట్రాక్ట్ అయినపుడు, ఈ వివాదాన్ని మీడియా ఆయన దృష్టికి తీసుకువచ్చింది. అప్పుడు ఆయన చాలా అమాయకంగా మాట్లాడారు. ఆ వైనం ఇలా వుంది.

వంశీ పైడిపల్లితో మీ సినిమా విషయంలో కొర్టు వివాదం వుంది కదా?

అవునా.. మీకు తెలుసా?

(మహేష్ సమాధానానికి అక్కడ వున్న కొద్దిమంది మహేష్ భజన పరులు పక్కున నవ్వారు)

మీతో సహా 14 మందికి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా?

అవునా? మీకు తెలుసా. 14 మంది అని నెంబర్ కూడా తెలుసా?

(మళ్లీ భజన బృందం నవ్వులు)

ఆ విధంగా వివాదం వ్యవహారాన్ని లైట్ చేయాలని ప్రయత్నించారు మహేష్ బాబు. కానీ అప్పటికే ఆవిషయం ఆయనకు తెలుసు అని, ఆయన శ్రీమతి నమత్ర ఓ మధ్యవర్తి ద్వారా పీవీపీని కలిసి, రాజీ ప్రతిపాదన చేసారని ఇండస్ట్రీలో వినిపిస్తూన్న సంగతి చాలా తెలివిగా, వ్యంగ్యంగా దాటవేసారు.

మరి ఇప్పుడు చినికి చినికి గాలివాన అయింది. మరి మహేష్ ఇప్పుడేమంటారు? ఇప్పుడు కూడా..’ మీకు తెలుసా? అవునా? ‘అనే అమాయకంగా అడగగలరా? భజన బృందం ఇప్పుడూ అలాగే నవ్వగలదా?