Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యాత్ర మాదిరిగానే యాత్ర షూటింగ్

యాత్ర మాదిరిగానే యాత్ర షూటింగ్

గతంలో వైఎస్, చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రలు నిరాటంకంగా నెలల తరబడి సాగాయి. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో ఆయన జీవితాన్ని కాస్త టచ్ చేస్తూ అందిస్తున్న సినిమా ‘యాత్ర’ ఈ సినిమా షూటింగ్ కూడా అలాగే ప్లాన్ చేసారట.

సాధారణంగా సినిమా షెడ్యూళ్లు, కంటిన్యూగా ఓ నెల వుంటాయి. కానీ యాత్ర సినిమా షెడ్యూలు ఈ నెల 20న ప్రారంభించి నాన్ స్టాప్ గా సెప్టెంబర్ వరకు చేస్తారట. అంటే దాదాపు మూడునెలలు అన్నమాట.

వైఎస్ పాత్రను మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. జగన్ పాత్ర కు తమిళ సూపర్ స్టార్ సూర్య ను అడిగారు. అది డిస్కషన్లలో వుంది.

రావురమేష్, శరణ్య తదితరులు ఇప్పటికి ఫిక్స్ అయిన స్టార్ కాస్ట్. యాత్ర సినిమాకు 70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతగా, మహి దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. వైఎస్ పాదయాత్ర పైన ఈ సినిమా కీలకంగా వుంటుంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో సినిమా ముగుస్తుంది.

యాత్ర సినిమాను చకచకా రెడీ చేసి జనవరి 15న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు వారం రోజులు ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ విడుదలవుతుంది. ఆ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?