తోడల్లుళ్లుగా వెంకీ-వరుణ్ ?

వరుణ్ తేజ్-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ అనిల్ రావిపూడి కలిసి ప్లాన్ చేస్తున్న ఎఫ్ 2 సినిమా కు ముహర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 23న ఈ…

వరుణ్ తేజ్-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ అనిల్ రావిపూడి కలిసి ప్లాన్ చేస్తున్న ఎఫ్ 2 సినిమా కు ముహర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 23న ఈ సినిమాకు పూజ కార్యక్రమం, ఓపెనింగ్ వుంటుందని తెలుస్తోంది. 23న పూజా కార్యక్రమాలు చేసి, 30 నుంచి సెట్ మీదకు వెళ్తారు. నాన్ స్టాప్ గా 20 రోజులు హైదరాబాద్ లోనే షూట్ చేస్తారు.

రాజా ది గ్రేట్ తరువాత అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ-వెంకటేష్ తోడల్లుళ్లుగా కనిపిస్తారు. రసవత్తరమైన ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాగా వుండే ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ సరసన మెహరీన్ నటిస్తున్నారు.

23న పూజ అయిన దగ్గర నుంచి 30 వరకు కంటిన్యూగా దేవీశ్రీప్రసాత్ తో మ్యూజిక్ సిటింగ్స్జ జరిపి ట్యూన్స్ ఫైనల్ చేసుకుంటారు. వీలయినంత త్వరగా షూటంగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి కాస్త అటుగా బరిలోకి దింపేలా సినిమాను రెడీ చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.