ఎన్ని సినిమాలు నిర్మించినా, నిర్మాత దిల్ రాజుకు బొమ్మరిల్లు సినిమా ప్రత్యేకం. ఫ్యామిలీ చిత్రాల నిర్మాతగా ఆ మధ్య సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. శతమానం భవతి సినిమాలు కూడా మరోసారి ప్రూవ్ చేసాయి. మళ్లీ మరోసారి అలాంటి సినిమానే అందించే ఫ్రయత్నం చేస్తున్నారు శ్రీనివాస కళ్యాణం సినిమాతో. నితిర్-రాశీఖన్నా కాంబినేషన్ లో తయారవుతున్న ఈ సినిమాను ఆగస్టు 9న విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. 2006 లో ఆగస్టు 9న విడుదలయింది ఆ సినిమా. అందుకే అదే డేట్ కు శ్రీనివాస కళ్యాణం సినిమాను విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట.
దాదాపు టాలీవుడ్ లో విడుదలయ్యే ఫ్రతి సినిమాతో ఏదో విధమైన బంధం వుంటుంది దిల్ రాజుకు. నైజాం లేదా విశాఖలో పంపిణీ చేయడమో, కొనడమో, లేదా థియేటర్లో ఇలా ఏదో ఒక బందం. పైగా యవి, గీతా లాంటి సంస్థలతో వ్యాపార బంధాలు వున్నాయి. అందుకే ముందుగానే, అందరికీ చెప్పి, ఆగస్టు 9 డేట్ ను రిజర్వ్ చేసే ప్రయత్నాల్లో వున్నారట దిల్ రాజు.
ఆ డేట్ కు మరే ఆబ్లిగేషన్ లేకుండా, మరో సినిమా పడకుండా థియేటర్లకు ఇబ్బంది పెట్టకుండా చూసుకునే ఆలోచన చేస్తున్నారట. శ్రీనివాస కళ్యాణం తొలి సగం అర్బన్ బేస్డ్ గా, మలి సగం పల్లెటూళ్లు, పెళ్లిళ్లు, అనుబంధాల నేపథ్యంలొ సాగుతుంది.