హీరో రానాకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి. అయితే ఆ తరువాత నిర్మాత సురేష్ బాబు, రానా కంటికి ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లాడని ఓ ప్రకటన వెలువరించారు. మామూలుగా అయితే ఇలా ప్రకటించాల్సిన పనిలేదు. కానీ ఎప్పుడయితే రకరకాల గ్యాసిప్ లు వినవచ్చాయో, ఆయన అలా ప్రకటించాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది.
కానీ వినిపస్తున్న గ్యాసిప్ లేమో బలంగా వున్నాయి. దగ్గుబాటి కుటుంబం కాస్త కలవరంలో వుందని, రానాకు కిడ్నీ సమస్య వచ్చిందని, సింగపూర్ లో రజనీకాంత్ ను ట్రీట్ చేసిన ఆసుపత్రికి తీసుకెళ్తారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
కానీ లేటెస్ట్ గా వేరే వినిపిస్తోంది. సింగపూర్ ప్లాన్ మారిందని, అమెరికాకే తీసుకెళ్తున్నారని అంటున్నారు. పలువురి సలహా మేరకు అమెరికానే ఎంచుకున్నారని, త్వరలో వెళ్తారని తెలుస్తోంది.
ఒకపక్క సురేష్ బాబు రెండో కొడుకు ఫోన్ పోవడం, దాన్ని పట్టకుని కొందరు బ్లాక్ మెయిల్ చేయడం, అది దొరకడం జరిగింది. ఆ తరువాత సురేష్ బాబు తన కొడుకును కట్టడిచేసి, ఇంటికే పరిమితం చేసారని కూడా వదంతులు వున్నాయి.
ఇలా రెండు సంఘటనలు ఇబ్బంది పెట్టడంతో, దగ్గుబాటి రామానాయుడు జయంతి వేడుకలు కూడా సరిగ్గా చేయలేకపోయారని, చాంబర్ దగ్గర ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా అందుకే వాయిదా పడిందని వినిపిస్తోంది.
ఇన్ని సమస్యలు ఒకేసారి వచ్చిపడడంతో దగ్గుబాటి సురేష్ బాగా డీలాపడ్డారని, ఆయనలో ఆ మార్పు క్లియర్ గా కనిపిస్తోందని దగ్గర నుంచి చూస్తున్నవాళ్లు చెబుతున్నారు. ఇండస్ట్రీ మొత్తాన్ని తన తెలివితేటలతో ఆయన నడిపిస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఇలా సమస్యలు చుట్టుముట్టాయి.