డిప్రెషన్ లో రాజ్ తరుణ్?

నాగార్జున లాంటి సీనియర్ హీరోలు, బ్యాకింగ్ వున్న వాళ్లు అయితే ఆఫీసర్ లాంటి పరవ వీర శూర డిజాస్టర్లను తట్టుకుంటారు కానీ, రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరోలు కాదు. వరుసగా రెండు మూడు…

నాగార్జున లాంటి సీనియర్ హీరోలు, బ్యాకింగ్ వున్న వాళ్లు అయితే ఆఫీసర్ లాంటి పరవ వీర శూర డిజాస్టర్లను తట్టుకుంటారు కానీ, రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరోలు కాదు. వరుసగా రెండు మూడు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో హీరో రాజ్ తరుణ్ ఎవ్వరికీ టచ్ లోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలయిన రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా ఇటు నిర్మాతను, అటు రాజ్ తరుణ్ కు కుదేలు చేసింది.

నిర్మాత అనిల్ సుంకర కు ఏకంగా తొమ్మిది కోట్లు నగదు నష్టాన్ని మూటకట్టింది. నిజానికి అనిల్ సుంకర కాబట్టి ఆ సినిమా విడుదలయింది. లేదంటే ల్యాబ్ లో మూలుగుతూ వుండేది. కానీ బ్యానర్ కు బ్యాడ్ నేమ్ రాకూడదని ఆయన రాత్రికి రాత్రి తొమ్మిది కోట్లు తెచ్చి మరీ సినిమాను విడుదలచేసారు. కానీ సినిమా ఫలితం ఇవ్వలేదు.

అయినా నిర్మాత అనిల్ సుంకర తట్టకున్నారు కానీ, రాజ్ తరుణ్ కాదు. ఏ బ్యాకింగ్ లేదు. సరైన హిట్ పడి చాలా కాలం అయింది. దాంతో సినిమా విడుదల రోజునే రాజ్ తరుణ్ ఫోన్ స్విచాఫ్ చేసేసారు. హైదరాబాద్ లో వుండకుండా ఎటో వెళ్లిపోయారు. ఆ తరువాత నాలుగు రోజులకు ఫోన్ స్విచాన్ చేసారు కానీ, ఎవరి ఫోన్ లు ఆన్సర్ చేయడం లేదని తెలుస్తోంది.

వాస్తవానికి రాజ్ తరుణ్ అంత దిగాలు పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అతగాడి తరువాత సినిమా దిల్ రాజు బ్యానర్ లో అనీల్ కృష్ణ డైరక్షన్ తయారైన 'లవర్' ఈ సినిమా వచ్చే నెల విడుదలకు రెడీగా వుంది. ఈ సినిమా బాగా వచ్చిందని ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది. ఒక్క హిట్ పడితే హీరోలకు మూడు సినిమాలు వస్తాయి. లవర్ తరువాత కుమారి 21 ఎప్ డైరక్టర్ ఫ్రతాప్ సినిమా వుంది.

అందువల్ల ఇక మీదటయినా, ఎవరికి పడితే వాళ్లకు డైరక్షన్ చాన్స్ లు ఇచ్చేయకుండా, కాస్త బ్యానర్ వాల్యూ, డైరక్టర్ వాల్యూ చూసి సినిమాలు చేసుకుంటే రాజ్ తరుణ్ ఇక ఎప్పుడూ ఫోన్ స్విచాఫ్ చేయాల్సిన పని వుండదు.