శ్రీరెడ్డి మైనస్ లు ఇవేనా?

బిగ్ బాస్ 2 షో కు నటి శ్రీరెడ్డి దూరం అవుతున్నట్లే కనిపిస్తోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ షో లో శ్రీరెడ్టి ఓ పార్టిసిపెంట్ అని ఒక్క గ్రేట్ ఆంధ్ర తప్ప, మిగిలిన…

బిగ్ బాస్ 2 షో కు నటి శ్రీరెడ్డి దూరం అవుతున్నట్లే కనిపిస్తోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ షో లో శ్రీరెడ్టి ఓ పార్టిసిపెంట్ అని ఒక్క గ్రేట్ ఆంధ్ర తప్ప, మిగిలిన మీడియా అంతా గ్యాసిప్ లు అందించింది. బిగ్ బాస్ 2 హోస్ట్ నాని మీదే ఇప్పుడు శ్రీరెడ్డి సోషల్ మీడియా పోరాటం స్టార్ట్ చేయడం చూస్తుంటే, ఆ షో లోకి ఆమె వెళ్లడం లేదనే అనుకోవాల్సి వస్తోంది.

అసలు బిగ్ బాస్ 2 షో లోకి వెళ్లడానికి శ్రీరెడ్డికి చాలా అడ్డంకులు వున్నాయి. అన్నింటికి మించి ఇటీవల కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న ఆమె వైఖరే. బిగ్ బాస్ 2 అన్నది కొంత వరకు లైవ్ షో. కొంత ఎడిటెడ్ వర్క్. అలాంటి షో లో కనుక శ్రీరెడ్డి పాల్గొని, తన చిత్తానికి మాట్లాడితే పరిస్థితి ఏమిటి?

శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరిపై ఆరోపణలు చేస్తుందో ఎవరికీ తెలియదు. రేపు షో నుంచి బయటకు వచ్చాక, ఆమెతో పాటు పార్టిసిపేట్ చేసిన వారిపై ఆరోపణలు చేయదని గ్యారంటీ లేదు. షో లో వుండగా ఇలా చేసారు, అలా చేసారు అంటే వారి పరిస్థితి ఏమిటి? ఆమె ఇలా చేయకపోవచ్చు. కానీ చేస్తుందేమో అన్న భయం తొటి పార్టిసిపెంట్ లలో వుంటుంది. దాంతో వారు ఆమెకు దగ్గరగా రావడానికే జంకుతారు.

బిగ్ బాస్ షో లో ఎలిమినేషన్ అన్నది కీలకం. సభ్యులే ఓటింగ్ ద్వారా ఈ పని నిర్వర్తిస్తారు. షో లో పాల్గొని శ్రీరెడ్డి ఎలిమినేట్ అయితే, ఆమె మెంటాలిటీ ప్రకారం ఏమైనా విమర్శలు చేస్తుందేమో అన్న భయం తొటి పార్టిసిపెంట్స్ లో వుంటుంది.

ఇక హోస్ట్ నాని తో ఆమె ఇంత వివాదానికి కాలుదువ్విన తరువాత ఎలా తీసుకుంటారు షో లోకి. తీసుకోరు అని ఫిక్సయిన తరువాతే, శ్రీరెడ్డి హీరో నానిపై ఈ యుద్దానికి దిగి వుండొచ్చు. ఏమయినా శ్రీరెడ్డి పేరు ఆది నుంచీ గ్యాసిప్ లిస్ట్ లో ఫస్ట్ న పెట్టిన వారి నమ్మకం వమ్మయినట్లే.