సునీల్ కు రోజుకు నాలుగు లక్షలు

హీరో వేషాలు వదిలేసుకుని, కమెడియన్ గా రంగంలోకి దిగడంతోనే సునీల్ పంట పండింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేతిలో వున్నాయి. అది కూడా పెద్ద డైరక్టర్లతో. చిన్న చితకా డైరక్టర్లతో హీరోగా సినిమాలు చేసి,…

హీరో వేషాలు వదిలేసుకుని, కమెడియన్ గా రంగంలోకి దిగడంతోనే సునీల్ పంట పండింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేతిలో వున్నాయి. అది కూడా పెద్ద డైరక్టర్లతో. చిన్న చితకా డైరక్టర్లతో హీరోగా సినిమాలు చేసి, పేరు అంతా పొగొట్టుకుని, ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ఇప్పుడు కమెడియన్ గా మారగానే, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, భీమినేని, హను రాఘవపూడి సిన్మాల్లో కీలకపాత్రలు దొరికాయి. 

వీటిల్లో శ్రీనువైట్ల, త్రివిక్రమ్, హను రాఘవపూడి సినిమాల్లో హిల్లేరియస్ క్యారెక్టర్లు దొరికాయంట. ఈ సంగతి అలా వుంచితే, హీరోగా చేసిపుడు రెమ్యూనిరేషన్ ఇచ్చినవారి కన్నా ఎగ్గొట్టిన వారే ఎక్కువ. ఇప్పుడు కాల్ షీట్ ల లెక్కన సునీల్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు నాలుగు లక్షలు వసూలు చేస్తున్నాడట.

హనురాఘవపూడి సినిమాలో అయితే అయిదు లక్షల వంతున ఇచ్చినట్లు వినికిడి కేవలం 15 కాల్ షీట్లు కావడం, కీలకపాత్ర కావడంతో ఇలా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

బ్రహ్మానందం రిటైర్ అయిపోవడం, వెన్నెల కిషోర్ మినహా సరైన కమెడియన్ సెట్ కాకపోవడంతో ఇప్పుడు చాలా గ్యాప్ వుంది. దాన్ని సునీల్ అందిపుచ్చుకునేటట్లే కనిపిస్తోంది.