ఆటగాళ్లు.. ఆట కొత్తగా?

కథానాయకుడు నేరంలో ఇరుక్కోవడం, అందరూ అనుమానించడం, దానికో ఫ్లాష్ బ్యాక్, చివరకు నిర్దోషి అన్న లైన్ కొత్తదేం కాదు. పైగా భార్యనో, ప్రియురాలినో తానే హత్య చేసాడనే అభియోగం హీరో మీద పడడం, దాని…

కథానాయకుడు నేరంలో ఇరుక్కోవడం, అందరూ అనుమానించడం, దానికో ఫ్లాష్ బ్యాక్, చివరకు నిర్దోషి అన్న లైన్ కొత్తదేం కాదు. పైగా భార్యనో, ప్రియురాలినో తానే హత్య చేసాడనే అభియోగం హీరో మీద పడడం, దాని ఆధారంగా కథ, కథనాలు అల్లడం కూడా.

అయితే నారా రోహిత్-జగపతిబాబు కాంబినేషన్లో తయారవుతున్న ఆటగాళ్లు సినిమా ఇదే లైన్ కు కొత్త కథనాన్ని జోడించి తయారుచేస్తున్నట్లు కనిపిస్తోంది. అపరాధిగా నారా రోహిత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జగపతి బాబు టీజర్ లో కనిపిస్తున్నారు.

వీరిద్దరి మధ్యలో పోలీస్ ఆఫీసర్ గా సుబ్బరాజు. ఈ ముగ్గురి నడుమ సాగిన ఇంట్రస్టింగ్ గేమ్ ఆటగాళ్లు సినిమా అనేటట్లు టీజర్ ను కట్ చేసారు. టీజర్ లో లైన్ కొత్తగా లేదు కానీ టేకింగ్ ఇంట్రస్టింగ్ వుంది. నారా రోహిత్ కు ఈ మధ్య సరైన పాత్ర పడలేదు. ఈ సినిమాలో ఆ చాలెంజింగ్ పాత్ర కనిపిస్తోంది.

ఆంధ్రుడు, అధినాయకుడు, రెచ్చిపో వంటి సినిమాలు అందించిన పరుచూరి మురళి దర్శకుడు. టేకింగ్ లో వున్న అనుభవం టీజర్ లో తెలుస్తోంది. అనుభవం వున్న నటులతో ఆడే ఆట కాబట్టి, ఏమాత్రం బాగా ఆడినా, సినిమా ఆఢేస్తుంది.