అనుపమ ట్రబులిస్తోందా?

అనుపమ పరమేశ్వరన్ మంచి నటి. ఫ్యామిలీ లుక్స్ తో మాంచి పెర్ ఫార్మెన్స్ ఇవ్వగలదు. అందుకే ఇప్పుడు చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇంకా అనేక ఎంక్వయిరీలు వున్నాయి. కానీ ఆమె వైఖరి మాత్రం…

అనుపమ పరమేశ్వరన్ మంచి నటి. ఫ్యామిలీ లుక్స్ తో మాంచి పెర్ ఫార్మెన్స్ ఇవ్వగలదు. అందుకే ఇప్పుడు చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇంకా అనేక ఎంక్వయిరీలు వున్నాయి. కానీ ఆమె వైఖరి మాత్రం చాలా ఇబ్బందికరంగా వుంటోందని ఇండస్ట్రీలో, ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు యూనిట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

దిల్ రాజు-రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తోంది అనుపమ ఇప్పుడు. నక్కిన త్రినాధరావు డైరక్టర్. ఈ సినిమా స్టార్ట్ అయినపుడే అనుపమతో కేరవాన్ విషయంలో సమస్య స్టార్ట్ అయినట్లు వినికిడి.

సాధారణంగా సింగిల్ డోర్ క్యారవాన్ లు, డబుల్ డోర్ క్యారవాన్ లు వుంటాయి. హీరోలకు మాత్రం సింగిల్ డోర్ క్యారవాన్ లు ఇస్తారు. మిగిలిన వారందరికీ డబుల్ డోర్ క్యారవాన్ లు ఇద్దరికి ఒకటి వంతున సద్దుతారు. డబుల్ డోర్ అంటే ఒకే కేరవాన్ లో రెండు రూమ్ లు అన్నమాట.

అయితే తనకు సింగిల్ డోర్ క్యారవాన్ కేటాయించాలని అనుపమ కోరినట్లు తెలుస్తోంది. దానికి యూనిట్ పెద్దగా స్పందించలేదని వినికిడి. చెప్పగా చెప్పగా, పెద్దదైన మరో డబుల్ డోర్ క్యారవాన్ ను తెప్పించినట్లు తెలుస్తోంది. అయినా అనుపమ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఈ సందర్భంగా అనుపమ పర్సనల్ స్టాఫ్ ఒకరు సర్ది చెప్పేకిపోతే, వారి మీద కోపగించడం, దాంతో ఆ వ్యక్తి మానేసి వెళ్లిపోవడం జరిగిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అలాగే యూనిట్ ఇచ్చిన కాస్ట్యూమర్ వద్దని, తన పర్సనల్ కాస్ట్యూమర్ నే కావాలని పట్టుపట్టినట్లు కూడా వినిపిస్తోంది. మొత్తం మీద అనుపమ మీద ఇండస్ట్రీ లో ఇలాంటి గుసగుసలు వినిపించడం ఆమె కెరీర్ కు అంత మంచిది కాదేమో?