ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ వైదొలగడంతో ఆ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు క్రిష్ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరిని దర్శకుడిగా తీసుకోవాలనే దానిపై చాలా ఆలోచించి, 'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడి చేతిలో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పెట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన క్రిష్ కొన్ని షరతులు పెట్టాడట.
ఎన్టీఆర్ కథ ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేదానిపై బాలకృష్ణ ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చునని, అయితే ఈ కథని నెరేట్ చేసే విధానాన్ని, స్క్రీన్‌ప్లేని పూర్తిగా తనకి వదిలేయాలని అడిగాడట. క్రిష్ టాలెంట్‌పై నమ్మకంతో కథనం మార్చడానికి బాలయ్య అంగీకరించాడట. ఇంకా క్రిష్ ఈ చిత్రం మొదలు పెట్టలేదు.
అతను డైరెక్ట్ చేస్తోన్న హిందీ చిత్రం మణికర్నిక పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ సెట్స్ మీదకి వెళుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ టీమ్ సేకరించిన మెటీరియల్ స్టడీ చేస్తోన్న క్రిష్ త్వరలోనే తన స్క్రీన్‌ప్లే సిద్ధం చేసి బాలయ్యకి నెరేషన్ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని నాలుగైదు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.