బాహుబలి తరువాత రంగమ్మ..మంగమ్మే

టాలీవుడ్ లో సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్ లు వున్నాయి. కాలానికి నిలిచినవి వున్నాయి. జనాల్లోకి దూసుకుపోయినవి వున్నాయి. పాతకాలం సంగతి పక్కన పెడితే ఇటీవలి కాలంలో సినిమా సమయంలో బ్లాక్ బస్టర్ కావడం,…

టాలీవుడ్ లో సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్ లు వున్నాయి. కాలానికి నిలిచినవి వున్నాయి. జనాల్లోకి దూసుకుపోయినవి వున్నాయి. పాతకాలం సంగతి పక్కన పెడితే ఇటీవలి కాలంలో సినిమా సమయంలో బ్లాక్ బస్టర్ కావడం, ఆ తరువాత ఆ పాటలు మరచిపోవడం మామూలే. కానీ ఇటీవల ఒక్క పాట, ఒక లెక్కలో దూసుకుపోయింది.

రంగస్థలం సినిమాలోని 'రంగమ్మా.. మంగమ్మా' పాట ఇలాంటి అలాంటి క్రెడిట్ సంపాదించలేదు. ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆ పాటే. యూట్యూబ్ నిండా ఆ పాట రీమిక్స్ లు, ఆ పాటకు డబ్ స్మాష్ లు, ఇన్నీ అన్నీ కావు.

రంగమ్మ మంగమ్మ పాట లిరికల్ వీడియో యూట్యూబ్ లో డెభై మిలియన్ల హిట్ లు సాధించింది. అదేపాట ఫుల్ వీడియో సాంగ్ యాభై మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. అంటే రెండూ కలిపితే దాదాపు 120మిలియన్ల వ్యూస్ అన్నమాట. యూట్యూబ్ లో వీడియో సాంగ్స్ లో బాహుబలితో పెద్ద రికార్డు వంద మిలియన్లకు పైగా వ్యూస్. అది కూడా ఒక్క పాటకే. మిగిలిన బాహుబలి పాటలన్నీ యాభై మిలియన్ల లోపు వ్యూస్ సాధించినవే.

బాహుబలి తరువాత మళ్లీ రంగమ్మ మంగమ్మదే రికార్డు.యాభై మిలియన్ల వ్యూస్. దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్ ఎంత క్యాచీగా వుందో, సమంత హావభావాలు అంతకు అంతా జనాలను ఆకట్టుకోవడం వల్లే ఇంత పెద్ద హిట్ సాధ్యమైందేమో? ఏమైనా రంగస్థలం రంగమ్మ.. మంగమ్మ సాంగ్ ప్రభంజనం ఇప్పట్లో ఆగకపోవచ్చు.