అల్లరి నరేష్ మాట నెగ్గలేదు?

ఏ హీరో అయిన పొజిషన్ బాగుంటేనే మాట చలామణీ అవుతుంది. లేదూ అంటే సర్దుకుపోవాల్సిందే. హీరో అల్లరి నరేష్ పరిస్థితి అలాగే అయినట్లు తెలుస్తోంది. చేతిలో ఓ సినిమా వుంది. అది కూడా సోలో…

ఏ హీరో అయిన పొజిషన్ బాగుంటేనే మాట చలామణీ అవుతుంది. లేదూ అంటే సర్దుకుపోవాల్సిందే. హీరో అల్లరి నరేష్ పరిస్థితి అలాగే అయినట్లు తెలుస్తోంది. చేతిలో ఓ సినిమా వుంది. అది కూడా సోలో హీరో కాదు. సునీల్ తో కలిసి చేస్తున్న సినిమా. ఈ సినిమా టైటిల్ మీద చాలా కథే నడిచింది. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తన ఎస్ సెంటి మెంట్ ప్రకారం సిల్లీ ఫెలోస్ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది హీరో నరేష్ కు నచ్చలేదు.

అక్కడి నుంచి వేరే టైటిళ్లు చెప్పడం మొదలయింది. వచ్చాడయ్యా సామి, సురేష్-రమేష్, ఫన్ రాజా ఫన్ ఇలా. ఇవేవీ అంత గొప్ప టైటిల్స్ కాదు. ఈలోగా సిల్లీ ఫెలోస్ మీదే నరేష్ ను కన్విన్స్ చేయడం ప్రారంభించారు. నిజానికి సిల్లీ ఫెలోస్ టైటిల్ బాగానే వున్నా.. సోలో హీరో సినిమా కాదు అన్నది టైటిల్ నుంచే కన్వే అయిపోతుంది. బహుశా అందుకే కావచ్చు నరేష్ అభ్యంతరం చెప్పింది.

ఆఖరికి మరే సరైన టైటిల్ దర్శకుడి దగ్గర నుంచి రాకపోవడంతో, నరేష్ కూడా సిల్లీ ఫెలోస్ కే ఓకె అనాల్సి వచ్చింది. దాంతో భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల, విశ్వప్రసాద్ నిర్మించే ఈ సినిమాకు సిల్లీ ఫెలోస్ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. త్వరలో విడుదలయ్యే ఈ సినిమాకు తమిళ సినిమా ఆధారం.

అన్నట్లు ఈ సినిమాలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తన పేరు భీమినేని శ్రీనివాస్ అని మార్చుకున్నారు. ఇది కూడా న్యూమరాలజీ నమ్మకమేమో?