ఎన్టీఆర్ బయోపిక్ లో కదలిక వచ్చింది. డైరక్టర్ గా క్రిష్ వచ్చి జాయిన్ అయ్యాక, పనులు స్పీడందుకున్నాయి. ముందుగా క్రిష్ తన దైన స్టయిల్ లో స్క్రీన్ ప్లేను మార్చే పనిలో పడ్డారు. ముందుగా అనుకున్న స్టోరీనే తన స్టయిల్ ఆఫ్ నెరేషన్ లోకి మారుస్తున్నారు. దాంతో పాటే కాస్టింగ్ పని మీద కూడా దృష్టి పెట్టారు.
సినిమాకు పూర్తి బజ్ రావాలి, ఓ క్లాసిక్ లుక్ పడాలి అంటే కాస్టింగ్ చాలా కీలకం, చిన్న పాతలయినా, పెద్ద పాత్రలయినా అందరూ వుంటేనే సినిమాకు సరైన లుక్ వస్తుంది. అందుకే ఇప్పుడు క్రిష్ ఆ పని మీద వున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబుకు పెద్దగా పాత్ర వుండకపోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సినిమా ముగుస్తుంది. అయితే చంద్రబాబు పెళ్లి అయితే సినిమాలో వుండే అవకాశం వుంది. అందుకే ఆ క్యారెక్టర్ కు ఓ మాంచి నటుడు అవసరం. ఇప్పుడు ఆ పాత్రకు హీరో రానాను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంటే చంద్రబాబు పాత్రలో రానా కనిపించబోతున్నాడన్నమాట. చిత్రంగా ఇక్కడ ఓ విషయం గుర్తు తెచ్చుకోవాలి. బాహుబలి సినిమాలో రానా పాత్ర భల్లాలదేవ. ఆ సినిమా కోసం భల్లాలదేవ విగ్రహాన్ని భారీగా తయారుచేయించారు. ఆ విగ్రహంలో చంద్రబాబు పోలికలు వున్నాయని అప్పట్లో అనుకున్నారు. అంటే రానా ఫీచర్లు చంద్రబాబు గెటప్ కు సరిపోతాయని అనుకోవడంలో సందేహంలేదు.