డీజే సినిమా వీర హిట్ అని హడావుడి చేసినా, ఆ సినిమా తరువాత డైరక్టర్ హరీష్ శంకర్ కు ఇంతవరకు సినిమా రాలేదు.
సినిమా లేకుండానే అమెరికాలో లోకేషన్లకు రెక్కీ అంటూ, కొత్త వాళ్లతో సినిమా అంటూ, కాదు, శర్వానంద్ తో సినిమా అంటూ ఏవేవో వార్తలు వినవచ్చాయి.
ఆఖరికి దాగుడు మూతలు అనే సినిమా దిల్ రాజ బ్యానర్ మీద శర్వానంద్ తో సినిమా ఫైనల్ అయిందని వార్తలు వెలువడ్డాయి.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ఏమిటంటే, శర్వా ఆ సినిమాకు నో చెప్పాడని. హరీష్ శంకర్ చెప్పిన అరగంట కథ పెద్దగొప్పగా లేదని, పైగా అరగంట తరువాత కథ అంతా పరమ రొటీన్ గా వుందని శర్వా ఫీలయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే నిర్మాత దిల్ రాజుకు చెప్పాడట. ఆయన వేరే కథనో, వేరే డైరక్టర్ నో పంపిస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తంమీద శర్వాతో సినిమానే డవుట్ లో పడితే హరీష్ శంకర్ కు ఇప్పట్లో మరో ఆప్షన్ వుండకపోవచ్చు. ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. ఆ తరువాత కూడా మరో రెండు సినిమాలు లైన్లో వున్నాయి.