తమకన్నా చిన్నవాడైన ప్రియుడితో ప్రేమాయణాలు సాగించిన నటీమణులు చాలామంది ఉన్నారు. అమ్రితాసింగ్, ఐశ్వర్యరాయ్‌లు కూడా ఈ కోవకు చెందిన వారే. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇదే దారిని అనుసరిస్తోందా? ఈమె కూడా తనకన్నా చాలా చిన్నవయసు వాడితో ప్రేమలో పడిందా? ఏకంగా 11యేళ్ల చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో ప్రియాంక ప్రేమాయణం సాగిస్తోందా?
హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఈ చర్చ సాగుతోందిప్పుడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ప్రియాంక కానీ నిక్ కానీ ధ్రువీకరించడం లేదు కానీ.. వీరి సోషల్ మీడియా పోస్టులు, వీరిద్దరూ కలిసి దిగిన పిక్స్‌తో ఈ ప్రచారం ఊపందుకుంటోంది. వీళ్లిద్దరి మధ్యనా ఎఫైర్ నడుస్తోందని పత్రికలు కోడై కూస్తున్నాయి.
కొన్నాళ్ల కిందట హాలీవుడ్‌కు తరలిపోయి అక్కడే బిజీ అయిపోయింది ప్రియాంక. టీవీ సీరిస్‌లు సినిమాలతో బిజీగా ఉండింది. అయితే ఈ మధ్య అక్కడ కూడా అవకాశాలు మందగించాయి. దీంతో ఈమె తిరిగి బాలీవుడ్ వైపు చూస్తోందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ ప్రేమాయణ గాసిప్స్ తో ప్రియాంక హాలీవుడ్‌లోనే జర్నీ సాగించేలా ఉంది. ఇలాంటి వ్యవహారాలతో బోలెడంత ప్రచారం వస్తుంది. కొన్ని అవకాశాలు కూడా కలిసి రావొచ్చు. ప్రస్తుతం ప్రియాంక వయసు 35సంవత్సరాలు. మగవాడితో సెక్స్‌కు తప్ప మరో అవసరం ఉండదని ఈ మధ్యనే ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అందుకు అవసరమైన వాడిని ఈమె పట్టేసినట్టేనా?