ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే తెలుగునాట కూడా సంచలనమే. అయితే గడచిన కొంత కాలంగా రజనీ సినిమాల గ్రాఫ్ కిందకే వస్తోంది. రోబో తరువాత మళ్లీ పైకి లేచిన దాఖలాలు లేవు. లాస్ట్ సినిమా కబాలి కూడా పెద్దగా పే చేసింది లేదు. అందుకే కాలా సినిమా మార్కెటింగ్ కాస్త కష్టమే అయింది.
కాలా సినిమా తెలుగు థియేటర్ హక్కుల బేరం 60కోట్ల దగ్గర ప్రారంభమైంది. లైకా సంస్థ ఈ రేటు కోట్ చేయగానే కొంతమంది జారిపోయారు. ఆ తరువాత 40కోట్ల దగ్గర కోట్ చేయడం ప్రారంభించారు. కొంతమంది 20కోట్లు అయితే ఓకె. అంతకన్నా ఎక్కువ అయితే అనవసరం అన్నట్లు బేరాలు సాగించారు. దాంతో ఇక చివరకి లైకా సంస్థ స్వంతగా విడుదల చేసుకోవాలని డిసైడ్ అయింది.
ఆ విధంగా ప్రాజెక్టు ఎన్వీ ప్రసాద్ అలియాస్ తిరుపతి ప్రసాద్ చేతిలోకి వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 25కోట్లు అడ్వాన్స్లు సంపాదించి ఇవ్వడానికి, ఏ భరోసా, ఎంజిలు లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఒప్పందం. మొత్తం ఈ వ్యవహారంలో ఎన్వీ ప్రసాద్ కు టెన్ పర్సంట్ కమిషన్ వస్తుంది. అంటే తీసుకున్న అడ్వాన్స్ ల మేరకు సినిమా ఆడితే చాలు, ఎన్వీ ప్రసాద్ కు మూడుకోట్ల వరకు ఆదాయం వస్తుంది. మంచి బేరమే.